Flaxseeds Benefits: రోజూ తాగే పాలతో ఫ్లెక్స్‌సీడ్స్ తీసుకుంటే నెలరోజుల్లో అధిక బరువుకు చెక్

www.mannamweb.com


Flaxseeds Benefits: బరువు తగ్గేందుకు అద్భుతమైన ఔషధం ఫ్లెక్స్‌సీడ్స్. వివిధ రకాల వంటల్లో తరచూ వినియోగించే ఈ సీడ్స్‌ను ఓ పద్ధతిలో వాడితే బరువు తగ్గడమే కాకుండా..బెల్లీ ఫ్యాట్ సైతం కరుగుతుంది.

స్థూలకాయం ప్రస్తుతం అందరికీ ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా..సరైన ఫలితాలు రాక నిరాశ చెందుతుంటారు.

ఈ క్రమంలో కొన్ని నిర్దిష్టమైన వ్యాయామ పద్ధతులతో పాటు నిత్యం వివిధ వంటల్లో ఉపయోగించే ఓ రకం సీడ్స్ తీసుకుంటే కచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. ఈ సీడ్స్ వల్ల కడుపు, నడుము భాగంలో ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది. ఫ్లెక్స్‌సీడ్స్ సహాయంతో బరువు తగ్గడమే కాకుండా శరీరంలో ఉండే ఇతర సమస్యలు కూడా దూరమౌతాయి.

ఫ్లెక్స్‌సీడ్స్ లాభాలు

ఫ్లెక్స్‌సీడ్స్ చూడ్డానికి చిన్నగా కన్పించినా సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. శరీరాభివృద్ధికి కీలకంగా దోహదపడతాయి. ఈ సీడ్స్‌లో అద్భుతమైన పోషక పదార్ధాలున్నాయి. ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హెల్తీ ప్రోటీన్లు, ఫెనోలిక్ కాంపౌండ్ , మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల..ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉన్నా దూరమౌతుంది. అందుకే ఇవాళే మీ డైట్‌లో చేర్చుకోండి.

ఫ్లెక్స్‌సీడ్స్ వల్ల చాలా రకాల రోగాల్నించి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గేందుకు ఫ్లెక్స్‌సీడ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఫ్లెక్స్‌సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే..మీ శరీరంపై పేరుకున్న కొవ్వు పూర్తిగా కరుగుతుంది. బరువును తగ్గించే న్యూట్రియంట్లు ఈ సీడ్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆకలిని చాలా వరకూ నియంత్రిస్తాయి. ఈ సీడ్స్ వల్ల ఇన్‌ఫ్లమేషన్, అజీర్ణం వంటి సమస్యలు దూరమౌతాయి.

ఫ్లెక్స్‌సీడ్స్ ఎలా తీసుకోవాలి

పాలలో కొన్ని ఫ్లెక్స్‌సీడ్స్ కలిపి తీసుకోవాలి. ఒక కప్పు పాలలో రెండు ఖర్జూరం పండ్లు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఫ్లెక్స్‌సీడ్స్ పౌడర్ వేసి తాగేయాలి. రోజూ ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితాలుంటాయి.