రంగరాయ మెడికల్ కాలేజ్ స్పెషల్ జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 34 ఖాళీలకు దరఖాస్తు కోరుతున్నట్లు అధికారక ప్రకటనలో తెలిపింది.
ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ నోటిఫికేషన్లో భాగంగా జాబ్స్ అప్లై చేసుకునేవారికి సింపుల్‌గా జాబ్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్లో భాగంగా అన్ని వివరాలను క్లియర్‌గా తెలిపారు. అయితే, ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
RMC రిక్రూట్మెంట్లో భాగంగా DME నియంత్రణలో కాంట్రాక్ట్‌తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్లో అధికారకంగా వెల్లడించింది. ఇందులో భాగంగా డ్రైవర్లతో పాటు క్లీనర్లు, వ్యాన్ అటెండెంట్ పోస్టుల భర్తీ పదవ తరగతి అర్హత ఉన్నవారిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే CT టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ఇవే కాకుండా అదనంగా టెక్నీషియన్ టెక్నీషియన్‌తో పాటు EEG టెక్నీషియన్, మోల్డ్ రూమ్ టెక్నీషియన్ పోస్టులను కూడా నోటిఫికేషన్ కోరారు. ఈ అధికారక నోటిఫికేషన్లో భాగంగా రేడియో థెరపీ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పని చేయాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అప్లై ప్రక్రియ ఆప్లైన్ ద్వారా స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు డిసెంబర్ 27 వరకు నేరుగా రంగరాయ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్లో వయోపరిమితిని కూడా పేర్కొన్నారు. వీటికి అప్లై చేసుకునేవారు 10వ తరగతి పాస్ అయితే చాలు.. అలాగే ఇతర పోస్టులకు ఏదైనా డిగ్రీ కూడా చదవాల్సి ఉంటుంది.
అలాగే ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రతి నెల రూ.15 వేల వరకు జీతం చెల్లించబోతున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇవే కాకుండా ఇతర పోస్టులకు రూ.32,670 నెల జీతం చెల్లించబోతున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి https://rmckakinada.com/ అధికారక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఈ దరఖాస్తుకు సంబంధించిన చివరి తేదిని కూడా అధికారక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలనుకునేవారు డిసెంబర్ 27వ తేది వరకు నేరుగా వెళ్లి.. దరఖాస్తు చేసుకోండి. ఇక మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U

































