బెంగళూరు వందేభారత్ పై రైల్వే తాజా నిర్ణయం: తిరుమల భక్తుల కోసం కొత్తగా

రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. కొత్తగా మరో రెండు వందేభారత్ లు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది.


తాజాగా విజయవాడ టు చెన్నై మధ్య నడిచే వందేభారత్ ను తాజాగా నర్సాపురం వరకు పొడిగించారు. విజయవాడ నుంచి బెంగళూరు వందేభారత్ ను తిరుపతి మీదుగా ప్రారంభించేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఇప్పుడు కాచిగూడ – యశ్వంత్ పూర్ వందేభారత్ పైన రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది.

కాచిగూడు – యశ్వంత్ పూర్ వందేభారత్ పైన రైల్వే శాఖ కీలక సమచారం ఇచ్చింది. ప్రస్తుతం ఈ రైలుకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో, విజయవాడ నుంచి బెంగళూరు కు కొత్తగా వందే భారత్ సర్వీసును ప్రారంభించేందుకు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు వరకు నడపాలని డిసైడ్ అయ్యారు. ఈ రైలు అందుబాటు లోకి వస్తే విజయవాడ నుంచి నాలుగున్నార గంటల్లోనే తిరుపతికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే షెడ్యూల్ సైతం ప్రకటించారు. అయితే సాంకేతిక కారణాలతో ఈ రైలు పట్టాలెక్కలేదు. కాగా.. తాజాగా కాచిగూడ – యశ్వంత్ పూర్ వందేభారత్ కు మరో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్‌ రైలు ఈనెల 27నుంచి హిందూపురంలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొన్నిరోజుల క్రితం ఎంపీ బీకే పార్థసారథి హిందూ పురంలో వందేభారత్‌ రైలు ఆపాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సోమన్నను కోరారు. దీనికి స్పందించిన మంత్రి ఈనెల 27నుంచి హిందూపురంలో రెండు నిమిషాలపాటు ఆపేందుకు రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాచిగూడ- యశ్వంత్ పూర్ – కాచిగూడ (20704, 20703 )నంబర్ల రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. కాగా.. విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (18521/18522), విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్(17219/17220) రైళ్లకు కొత్తగా కొవ్వూరులో హాల్ట్ కల్పించారు. ఈ మేరకు రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి కొవ్వూరులో విశాఖ పట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

గతంలో కరోనా కాలంలో కొవ్వూరులో ఆగే పలు రైళ్లను రద్దు చేశారు. దీంతో కారణంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో తమ సమస్యను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. దీంతో కేంద్రమంత్రి ఆదేశాలతో రైల్వేశాఖ ఈ రెండు రైళ్లకు కొవ్వురులో హాల్ట్ కల్పించింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొవ్వూరు పరిసర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి ఈ రైళ్లు బాగా ఉపయోగపడనున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.