దేశవ్యాప్తంగా ఇంధన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన అంతర్జాతీయ సంస్థషెల్ (Shell) ఇప్పుడు భారతదేశంలో పెట్రోల్ పంప్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఆసక్తి చూపుతోంది.
ఇందులో భాగంగా రిటైల్ పార్ట్‌నర్‌షిప్ మోడల్ (Retail Partnership Model) ద్వారా సాధారణ పెట్టుబడిదారులకు కూడా పెట్రోల్ పంప్ నిర్వహణ అవకాశం కల్పిస్తోంది. కేవలం మీ దగ్గర రూ.10 లక్షలుంటే చాలు పెట్రోల్ బంక్ బిజినెస్ ప్రారంభించవచ్చు. షెల్ కంపెనీ ఆఫర్ చేస్తున్న ఈ డీలర్ షిప్ మీరు ఎలా దక్కించుకోవచ్చు ఈ కథనంలో చూడండి.
దేశంలో లాస్ లేని వ్యాపారాల్లో ఒకటి పెట్రోల్ బంక్. అయితే ఇది అంత సులుభంగా అయితే దక్కదు. ఎందుకంటే వైన్ షాప్స్ మాదిరిగానే ఇక్కడ కూడా టెండర్ విధానం ఉంటుంది. డ్రా తీసే సమయంలో అదృష్టవంతులకు పెట్రోల్ బంక్ దక్కుతుంది. అయితే షెల్ ఆఫర్ చేస్తున్న ఈ డీలర్ షిప్ లో మీ ప్రాంతం కూడా చాలా కీలకంగా మారబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో తమ బ్రాండ్ ను బాగా విస్తరించాలని షెల్ భావిస్తుంది. అందుకే పార్ట్‌నర్‌షిప్ కోసం ఆహ్వానం పలికింది. ఈ విధానంలో పెట్రోల్ పంప్ యజమాని భూమి, రోజువారీ నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో హైదరాబాద్ లో ఒక బంక్, ఏపీలోని నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ,విశాఖపట్నంలో బంక్ లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. అందులో రూ.7 లక్షలు సెక్యూరిటి డిపాజిట్. ఇవి మళ్లీ మీకే తిరిగి వస్తాయి. ఇందులో షెల్ నిర్వహించే బాధ్యతలు ఏంటంటే.. బ్రాండింగ్, ఫ్యూయల్ సరఫరా, టెక్నాలజీ, సిబ్బంది ట్రైనింగ్, ఆపరేషనల్ మార్గదర్శకాలు అన్నింటిని Shell కంపెనీనే అందిస్తుంది. అయితే పెట్టుబడి మొత్తం ప్రాంతం, భూమి,స్టేషన్ సైజ్ ఆధారంగా మారవచ్చు.
అప్లై చేయడానకి అర్హతలు తప్పనిసరి:
పెట్రోల్ బంక్ పెట్టడానికి అప్లై చేయాలని అనుకునే వారు కచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి. వయస్సు 21 సంవత్సరాలు పైబడి ఉండాలి. సొంత భూమి ఉండాలి లేదా లీజుకు తీసుకునే అవకాశం ఉండాలి. భూమి ప్రధాన రహదారి / హైవే / వాణిజ్య ప్రాంతంలో ఉండటం మంచిది. భూమికి సంబంధించిన నిబంధనలు కూడా చాలా కీలకం. భూమి కమర్షియల్ యూజ్‌కు అనుమతి పొందినదై ఉండాలి. హైవేల్లో అయితే NHAI నిబంధనలు పాటించాలి. ఎంట్రీ – ఎగ్జిట్ సౌకర్యం ఉండాలి. కనీస విస్తీర్ణం ప్రాంతాన్ని బట్టి మారవచ్చు
ఎలా అప్లై చేయాలి?
పెట్రోల్ పంప్ కోసం అప్లై చేయాలంటే Shell అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. Fuel Retail / Business Opportunity / Become a Partner సెక్షన్ ఎంచుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూరించాలి. వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు నమోదు చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత Shell టీమ్ పరిశీలన ఉంటుంది. అర్హత సాధిస్తే ఇంటర్వ్యూ & సైట్ ఇన్‌స్పెక్షన్ చేస్తారు. ఒప్పందం పూర్తయ్యాక ట్రైనింగ్ ప్రారంభంమవుతుంది. ఆ తర్వాత Shell కంపెనీ వారే పెట్రోల్ బంక్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటారు.

































