వరప్రసాద్ ట్రైలర్ మీద ‘మెగా’ ఒత్తిడి

ల్లుండి తిరుపతిలో మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ జరగబోతోంది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క అనేలా ఫైనల్ కట్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.


ఎందుకంటే ఈ రోజు వరకు మూడు పాటలు మినహాయించి ఈ సినిమా నుంచి ఎలాంటి వీడియో కంటెంట్ రాలేదు.

అంటే సన్నివేశాలు, డైలాగులు, ఫైట్లు లాంటివి ఏవీ రివీల్ చేయకుండా దర్శకుడు అనిల్ రావిపూడి ఇక్కడిదాకా నెట్టుకొచ్చారు. అటుచూస్తే వందల కోట్లతో తీసిన రాజా సాబ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ ఇప్పటికే రెండు టీజర్లు, ఒక ట్రైలర్ కలిపి మొత్తం తొమ్మిది నిమిషాల వీడియోని అభిమానులకు చూపించేసింది.

బిజినెస్ ఎంత బాగా జరుగుతున్నా మెగాస్టార్ ఇమేజ్, రావిపూడి బ్రాండ్ మీద ఎంత క్రేజ్ నెలకొన్నా, గ్రౌండ్ లెవెల్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని తాలూకు సౌండ్ ఇంకా పెరగాలి. ఇప్పుడు ట్రైలర్ లో చూపించే విజువల్స్, కామెడీ యాంగిల్స్, యాక్షన్ బిట్స్ మీదే ఇది ఆధారపడి ఉంటుంది.

ఎందుకంటే భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి తెరమీద కనిపించి రెండు సంవత్సరాల అయిదు నెలలైపోయాయి. ఇది చాలా ఎక్కువ గ్యాప్. అవతల బాలకృష్ణ ఇదే టైంలో దూసుకుపోయారు. అఖండ 2 టాక్ తో సంబంధం లేకుండా ఎంతో కొంత వసూళ్లు తెస్తూనే ఉండటానికి కారణం బాలయ్య స్క్రీన్ కంటిన్యూటీ మెయిన్ టైన్ చేయడం.

సో ఇప్పుడు ఒక్కసారిగా మన శంకరవరప్రసాద్ గారు మీద హైప్ పెరిగిపోవాలంటే ఆ మేజిక్ చేసే బాధ్యత ట్రైలర్ మీదే ఉంది. ఇన్ సైడ్ టాక్ అయితే అనిల్ రావిపూడి ఏదీ దాచకుండా మెయిన్ లైన్ రివీల్ చేశారని, చిరు నయన్ ప్రేమ,పెళ్లి, విడాకులతో పాటు ఫ్యామిలీ సెటప్, విలన్ గ్యాంగ్ వ్యవహారం లాంటివన్నీ చూపించబోతున్నారట.

ముఖ్యంగా మెగాస్టార్ స్వాగ్ చూపించే కీలకమైన క్లిప్స్ ఇందులో పొందుపరిచారని తెలిసింది. అదే నిజమైతే మటుకు ట్రైలర్ మీదున్న మెగా ఒత్తిడి పాజిటివ్ గా మారిపోయి అంచనాలు పెంచేస్తుంది. ముఖ్యంగా టార్గెట్ చేసుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తే లక్ష్యం నెరవేరినట్టే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.