పుష్య పౌర్ణమి.. చాలా శక్తిమంతమైన రోజు.. ఇలా చేస్తే శని దోషాలన్నీ దూరం

జనవరి 3వ తేదీ.. శనివారం.. శివ ముక్కోటి.. ఆరుద్రోత్సవం, పుష్య పూర్ణిమ.. ఈ సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, ఆరుద్రోత్సవం శివ ముక్కోటికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, పుష్య పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం.


జనవరి 3వ తేదీ చాలా శక్తిమంతమైన రోజు. వైష్ణవ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉంతో శైవ సంప్రదాయంలో ఆరుద్రోత్సవానికి అంతే ప్రాధాన్యత ఉంది. దీన్ని శివ ముక్కోటి అనే పేరుతో పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి ఏ విధంగా ముక్కోటి ఏకాదశి అవుతుందో అదే విధంగా శైవ సంప్రదాయంలో ఆరుద్రోత్సవం అనేది శివ ముక్కోటి అవుతుంది. అది ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు.

జనవరి 3వ తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆరోజు పుష్య పౌర్ణమి వచ్చింది. పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి తిధిని మహా పౌషి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాపౌషి చాలా శక్తిమంతమైన రోజు. భయంకరమైన శని పీడలు, శని బాధలు పోగొట్టే శక్తి ఈ మహాపౌషికి ఉంటుంది. ఆరోజు ప్రాత:కాలంలో శనీశ్వరుడి దర్శనం అద్భుతమైన ఫలితాలు కలిగిస్తుంది.

ఆలయానికి వెళ్లి నవగ్రహాల్లో శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. శనేశ్చరుడికి తైలాభిషేకం చేసుకోవడం, లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకం, లేదా ఆవాల నూనెతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత కాళ్లు చేతులు కడుక్కుని కళ్లు తుడుచుకుని ఆ తర్వాత శివుడిని దర్శించుకుని శివాభిషేకం చేసుకోవాలి. అలా చేస్తే పుష్య పౌర్ణమి మహాపౌషి శనేశ్చరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి భయంకరమైన శని పీడలు, శని బాధలు తొలగిపోతాయి.

ఓం శం శనైశ్చరాయ నమ: అనే మంత్రం చదువుతూ నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయి. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఏలినాటి శని, అష్టమ శని, సప్తమి శని ఇలా ఇవన్నీ తొలగిపోవాలంటే సూర్యోదయానికి ముందే శనేశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. ఆ తర్వాత శివ దర్శనం చేసుకుని, అభిషేకం చేయించుకోవాలి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లోనే దీపం పెట్టాలి..

ఆలయానికి వెళ్ల లేని వారు పుష్య పౌర్ణమి మహా పౌషి సందర్భంగా ఇంట్లో స్నానం చేశాక పడమర దిక్కులో ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి 8 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఆ వత్తి పడమర వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్ని శని దీపం అంటారు. ఇలా చేయడం వల్ల భయంకరమైన శని పీడల నుంచి బయటపడొచ్చు. జనవరి 3 శనివారం ఎవరైతే నువ్వులు దానం ఇస్తారో వాళ్లు సంవత్సరం పాటు ప్రతి శనివారం నువ్వులు దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది. ఆ రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో 1 1/4 కేజీ నల్ల నువ్వులు నలుపు వస్త్రంలో మూట కట్టి ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.

జనవరి 3 శనివారం దశరథ శని స్తోత్రాన్ని విన్నా కూడా సమస్త శని దోషాలు తొలగిపోతాయి. అలాగే దారిద్ర దహర శివ స్తోత్రాన్ని శివాలయంలో లేదా ఇంట్లో కూర్చుని చదివిని విన్నా అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. జనవరి 3 చాలా శక్తిమంతమైన రోజు. భయంకరమైన శని పీడలు పోగొట్టుకునే రోజు. జన్మజన్మల దారిద్ర్య బాధలు పోగొట్టుకుని శివానుగ్రహం పొందే రోజు. పుష్య పౌర్ణమి, మహాపౌషి, ఆరుద్రోత్సవం, శివ ముక్కోటి.. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని శని దోషాల నుంచి బయటపడండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.