లక్షల్లో జీతంతో SBI ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.


బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం, మంచి జీతభత్యాలు కోరుకునే అభ్యర్థులకు ఇది అరుదైన అవకాశం అని చెప్పవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా SBI బ్రాంచులు, వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తంగా 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం ఖాళీలు..

ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు..

వైస్ ప్రెసిడెంట్ వెల్త్ (SRM) – 582 పోస్టులు

అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వెల్త్ (RM) – 237 పోస్టులు

కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (CRE) – 327 పోస్టులు

ఈ ఉద్యోగాలు ప్రధానంగా వెల్త్ మేనేజ్‌మెంట్, కస్టమర్ హ్యాండ్లింగ్, ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసులకు సంబంధించినవిగా ఉంటాయి.

అర్హతలు & అనుభవం..

సంబంధిత పోస్టులను అనుసరించి, అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ముందస్తు పని అనుభవం తప్పనిసరి.

పోస్టును బట్టి అవసరమైన విద్యార్హతలు, అనుభవం మారుతుండటంతో అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని అధికారులు సూచిస్తున్నారు.

వయోపరిమితి & రిజర్వేషన్ సడలింపులు..

2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి:

ఓబీసీ అభ్యర్థులకు – 3 సంవత్సరాలు

ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు

పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు – గరిష్టంగా 10 సంవత్సరాలు

జీతభత్యాలు & ఇతర ప్రయోజనాలు..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్షల్లో నెలవారీ వేతనం చెల్లించనున్నారు. పోస్టును బట్టి జీతం మారుతుందని, పనితీరు ఆధారంగా ఒప్పంద కాలాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుందని SBI స్పష్టం చేసింది. అదనంగా ఇతర అలవెన్సులు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కూడా ఉండే అవకాశం ఉంది.

ఎంపిక విధానం..

ఈ నోటిఫికేషన్‌లో ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.

దరఖాస్తు విధానం..

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 10, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు..

జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – ₹750

ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు – ఫీజు లేదు

సూచనలు..

అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని, అర్హతలు సరిపోతున్నాయా లేదా నిర్ధారించుకోవాలని SBI సూచించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు SBI అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.