‘నో సెల్ ఫోన్ జోన్’గా ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు.

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.


ఈ క్రమలో ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహనకు పక్కా ఏర్పట్లు చేస్తుంది. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు 2026 విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రజాళికాబద్దంగా వ్యవహరించాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇక జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి ఒకటి నుంచి 10వ తేదీ వరకు సాధారణ ప్రయోగ పరీక్షలు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 21 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి.

దీంతో అన్ని పరీక్షా కేంద్రాలు ‘నో సెల్ ఫోన్’ జోన్ గా ఉండాలని, అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్ధుల సౌకర్యార్ధం తాగునీళ్లు, విద్యుత్తు ఉండేలా చూడాలని వివరించారు. వైద్య శిబిరాలు సైతం నిర్వహించాలని, పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

అలాగే పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డు ఇప్పటికే ఆయా జూనియర్ కాలేజీలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను బోర్డులోని కార్యాలయానికి అనుసంధానం చేయాలని పేర్కొంది. ప్రాక్టికల్స్‌లో అవకతవకల కట్టడికి ఈ మేరకు ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. కాగా ఈ ఏడాది ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఆయా తేదీల్లో జరగనున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.