అసలు బంగారం షాపుల్లోకి వెళ్లాలంటేనే ప్రజలు వణుకుతున్నారు. అలాంటి బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..
నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,530 కాగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,620 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650 ఉండగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,650 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,090 పెరిగింది.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,650 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,620 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,650 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,650 వద్ద ఉంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,770 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,31,800 వద్ద కొనసాగుతోంది.
నేటి సిల్వర్ ధరలు ఇలా..
పండుగ వేళ పసిడి ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది గోల్డ్ మార్కెట్.. నేడు సిల్వర్ ధరలు దారుణంగా పెరిగిపోయాయి. నిన్న మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,92,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,07,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.15,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,90,000 వద్ద పలుకుతోంది. ఇక చాలురా బాబు.. నిన్నమొన్నటి వరకు రెండు లక్షలు అయితేనే ప్రజలు ఆందోళన చెందారు.. ఇప్పుడు ఏకంగా మూడు లక్షలు దాటేసింది.. ఇక బంగారం, సిల్వర్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్నట్టుగా ఉంది వ్యవహారం..


































