పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూతోనే ఉద్యోగం

మెడికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌. ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS) కింద 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
దీనికి సంబంధించి ECHS రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ (ECHS Recruitment 2026)ను విడుదల చేసింది. మెడికల్, పారామెడికల్, నాన్-పారామెడికల్ పోస్టుల కోసం ఈ నియామకం జరుగుతుంది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 08లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బరేలీ, బదౌన్, రాంపూర్, మొరాదాబాద్‌లోని ECHS పాలీక్లినిక్‌లలో కాంట్రాక్టు ప్రాతిపదికన (ప్రారంభంలో ఒక సంవత్సరం) నియమిస్తోంది. కాంట్రాక్టును మరొక సంవత్సరం లేదా అభ్యర్థి గరిష్ట వయస్సు చేరుకునే వరకు పొడిగించవచ్చు. ఇదంతా శాటిస్‌ఫ్యాక్టరీ పర్ఫార్మెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ డీటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.


ECHS ఇంటర్వ్యూ తేదీలు
2026 ఫిబ్రవరి 16: OIC, మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, గైనకాలజిస్ట్

2026 ఫిబ్రవరి 17: డెంటల్ ఆఫీసర్, డెంటల్ అసిస్టెంట్

2026 ఫిబ్రవరి 18: ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్

2026 ఫిబ్రవరి 19: నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, DEO, క్లర్క్

వేకెన్సీ డీటైల్స్‌ (ECHS Vacancy Details)
13 జాబ్‌ ప్రొఫైల్స్‌కి సంబంధించి మొత్తం 56 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అందులో..

OIC – 4

మెడికల్ స్పెషలిస్ట్ (MD) – 1

మెడికల్ ఆఫీసర్ – 12

గైనకాలజిస్ట్ – 1

డెంటల్ ఆఫీసర్ – 7

డెంటల్ అసిస్టెంట్ – 5

ల్యాబ్ టెక్నీషియన్ – 5

ల్యాబ్ అసిస్టెంట్ – 2

ఫార్మసిస్ట్ – 5

నర్సింగ్ అసిస్టెంట్ (జనరల్) – 6

ఫిజియోథెరపిస్ట్ – 1

DEO – 1

క్లర్క్ – 5

అప్లికేషన్‌ ప్రాసెస్‌
అప్లికేషన్ ప్రాసెస్‌ ఆఫ్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది. అభ్యర్థులు ముందుగా అధికారిక ECHS వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ ఫామ్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అన్ని డీటైల్స్‌ జాగ్రత్తగా నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్‌ సెల్ఫ్‌ అటెస్టెడ్‌ కాపీలను యాడ్‌ చేయాలి. ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్స్‌, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్స్‌ (వర్తిస్తే), CMO/SEMO జారీ చేసిన ఫిజికల్‌ ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ అవసరం. కంప్లీట్‌ చేసిన అప్లికేషన్స్‌ని OIC, స్టేషన్ ప్రధాన కార్యాలయాలు (ECHS సెల్), బరేలీకి పంపాలి. అప్లికేషన్‌ 2026 ఫిబ్రవరి 08కి ముందు లేదా తేదీలోపు చేరేలా చూసుకోండి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్లను పరిశీలించరు.

ECHS ఇంటర్వ్యూ డీటైల్స్‌
ఇంటర్వ్యూ వెన్యూ: స్టేషన్ ప్రధాన కార్యాలయాలు (ECHS సెల్), బరేలీ

రిపోర్టింగ్ సమయం: ఉదయం 09:00

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 03:00 వరకు

అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సినవి: ఒరిజినల్‌ ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్లు, ఒరిజినల్‌ ఎక్స్‌పీరియన్స్‌ (వర్తిస్తే), CMO/SEMO జారీ చేసిన ఫిజికల్‌ ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లాలి.
TA/DA ఉండవు. అవసరమైన అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

ECHS అర్హత ప్రమాణాలు
అర్హత అప్లై చేసుకున్న పోస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థులు సంబంధిత విద్యా అర్హతలు, ఎక్స్‌పీరియన్స్‌, కొన్ని సందర్భాల్లో సాయుధ దళాల శిక్షణ కలిగి ఉండాలి. మెడికల్ పోస్టులకు ప్రొఫెషనల్ డిగ్రీలు, మినిమం ఎక్స్‌పీరియన్స్‌ అవసరం. పారామెడికల్, క్లరికల్ పోస్టులకు డిప్లొమాలు లేదా గ్రాడ్యుయేషన్, సంబంధిత ఎక్స్‌పీరియన్స్‌ అవసరం.

సెలక్షన్‌ ప్రాసెస్‌
సెలక్షన్‌ పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేదు. ఫైనల్‌ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ECHS జీతం
మెడికల్ స్పెషలిస్ట్/ గైనకాలజిస్ట్ – రూ.1,30,000

OIC/ మెడికల్ ఆఫీసర్/ డెంటల్ ఆఫీసర్ – రూ.95,000

డెంటల్ అసిస్టెంట్/ ల్యాబ్ టెక్నీషియన్/ ఫార్మసిస్ట్/ నర్సింగ్ అసిస్టెంట్/ ఫిజియోథెరపిస్ట్ – రూ.36,500

DEO/ క్లర్క్ – రూ.29,200

DEO (చౌకీదార్ స్థానంలో) – రూ.21,800

క్లర్క్ (ప్యూన్ స్థానంలో) – రూ.21,800.

ఇంకేవైనా డీటైల్స్‌ చెక్‌ చేయాలంటే అధికారిక వెబ్‌సైట్‌ (www.echs.gov.in)ని విజిట్‌ చేయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.