మెట్రో రెండో దశకు కేంద్రం సుముఖం

హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి చర్చించానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.

ముందుగా మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని, అందుకు అన్ని ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఈ లేఖలో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతి గురించి ప్రస్తావించారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా మెట్రో రెండో దశ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిందని గుర్తుచేశారు. ఇప్పటికే అమలు జరుగుతున్న మొదటి దశ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీ నం చేసుకుని, తామే నిర్వహిస్తామని ప్రకటించిందని ప్రస్తావించారు. లావాదేవీలు పూర్త యిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.


కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి అంగీకరిం చిందని కూడా కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ గుర్తు చేశారని అన్నారు. మెట్రో మొద టి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి తీసుకోవడం, రెండో దశ సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్రెడ్డిని కలసి నిర్ణయించారని కూడా కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తనకు తెలిపారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున మరో ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని కోరినట్లు కూడా వివరించారు. కానీ, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ఎందుకు ప్రతిపాదించలేదని ప్రశ్నించారు. కావున సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అధికారుల పేర్లను పంపి సమావేశ నిర్వహణకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రో నెట్వర్క్ ను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా స్వాధీనం చేసుకుని ఆ తర్వాత రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. విలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కిషన్‌రెడ్డి కోరారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.