జేఈఈ అడ్మిట్ కార్డులొచ్చేశాయ్

 ఏడాది ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్స్ 2026) సెషన్ 1 కోసం అడ్మిట్ కార్డుల్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ విడుదల చేసింది.


ఇప్పటికే ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వీటిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి, లింక్, ఇతర వివరాలను ఎన్టీఏ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షల్ని జనవరి 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటి నాలుగు రోజుల పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డుల్ని ఇవాళ విడుదల చేశారు. అంటే జనవరి 21, 22, 23, 24 తేదీల్లో జరిగే జేఈఈ మెయిన్ పేపర్ 1 కు సంబంధించిన అడ్మిట్ కార్డులు మాత్రమే విడుదలయ్యాయి. త్వరలో జనవరి 28, 29 తేదీల్లో జరిగే పేపర్ 2 పరీక్షల అడ్మిట్ కార్డుల్ని విడుదల చేస్తారు.

ఇవాళ విడుదల చేసిన పేపర్ 1 పరీక్ష అడ్మిట్ కార్డుల్ని వీటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలను రెండు షిఫ్టులుగా నిర్వహించబోతున్నారు. ఇందులో మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ ఉంటుంది. అలాగే రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ ఉంటుంది. ఎన్టీఏ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే అడ్మిట్ కార్డులు కనిపిస్తాయి. వాటిని అన్ని వివరాలు చెక్ చేసుకున్నాక ప్రింట్ తీసుకుని పరీక్ష కేంద్రాలకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.