ఇంటి మెయిన్ గేటు వాస్తు ప్రకారం ఎలా ఉండాలి?

వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం జరిగితే అందరూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. దీనివల్ల ఎటువంటి ఆర్థిక ఇబ్బందులుండవు. సమస్యలు రావు. వచ్చినా పరిష్కరించుకోవడానికి అవకాశాలుంటాయి.


ప్రధానంగా ఇంటికి సంబంధించి మెయిన్ గేటు విషయంలో మాత్రం వాస్తు పక్కాగా పాటించాలి. ఆ గేటును ఎటువైపు పెట్టాలో అర్థం కాక చాలామంది తప్పులు చేస్తుంటారు.

వాస్తు నిపుణుల సలహాలను కూడా సరిగా తీసుకోరు. తీసుకున్నా పాటించరు. కొంతమంది మాత్రమే పాటిస్తుంటారు. ఇలా చేయడంవల్ల కుటుంబంలోని మహిళలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చికాకులు కలిగిస్తాయి. అలా కాకుండా వాస్తు ప్రకారం మెయిన్ గేటు ఎలా ఉండాలనేది తెలుసుకుందాం.

తూర్పు వాకిలి ఉంటే గేటు తూర్పులో ఉండాలి.

అలా వీలు కానప్పుడు దక్షిణం వైపు పెట్టుకోవాలి.

దక్షిణం ఆగ్నేయం లేదంటే దక్షిణం మధ్యలో గేటు పెట్టుకోవాలి.

ఇలా నడిస్తే మీకు ఎటువంటి దోషాలు అంటవు.

మెయిన్ గేటు వాస్తు ప్రకారం ఉంటే సానుకూల శక్తి ఆ ఇంట్లో ఉంటుంది.

తూర్పు వాకిలి ఇంటికి గేటు ఈశాన్యం వైపు ఉండాలి.

ఉత్తరం వాకిలి ఇంటికి కూడా ఈశాన్యం వైపు గేటు ఉండటం మంచిది. ఇది ఐశ్వర్యాన్ని ఇస్తుంది.

దక్షిణం వాకిలి ఇంటికి ఆగ్నేయం వైపు గేటు ఉండాలి.

పడమర వాకిలి ఇంటికి వాయువ్యం వైపు గేటు ఉండాలి.

కాంపౌండ్ వాల్ కంటే ఎక్కువ ఎత్తులో మెయిన్ గేటు ఉండకూడదు.

వాస్తు ప్రకారం సింగిల్ గేటు కంటే రెండు తలుపులు పెట్టి ఒకటి లోపలికి తెరుచుకునేలా ఉంటే మంచిది.

గేటు తీసేటప్పుడు లేదా వేసేటప్పుడు ఎటువంటి శబ్దాలు రాకూడదు.

గేటు వేసేటప్పుడు, తీసేటప్పుడు శబ్దాలు రావడంవల్ల ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.

మెయిన్ గేటుకు ఎదురుగా చెట్లు, విద్యుత్తు స్తంభాలు ఉండకూడదు.

గేటు ముందు చెత్తాచెదారం ఉండకూడదు.

మురుగునీరు నిల్వ ఉండకూడదు.

మెయిన్ గేటుకు లేత పసుపు, తెలుపు, వెండి, ముదురు నలుపు, ఎరుపు రంగులనే వాడండి.

గేటుపై ఓం లేదంటే స్వస్తిక్ గుర్తు వేయండి.

రాత్రివేళ గేటును చీకటిగా ఉంచొద్దు. లైట్లు పెట్టండి.

ఇంటి ప్రధాన ద్వారం కంటే కొంచెం పెద్దదిగా ఉండాలి.

కాంపౌండ్ వాల్ నైరుతి మూల కంటే ఈశాన్యం వైపు కొంచెం తక్కువ ఎత్తులో ఉండాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.