Coriander Seeds : గుప్పెడు ధనియాలు చాలు.. శరీరంలో పేరుకుపోయిన చెత్త మొత్తం బయటకు వస్తుంది..

Coriander Seeds : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ధనియాలు ఒకటి. వంటల్లో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ధనియాలను వాడడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ధనియాల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని వాడడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ధనియాల్లో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే వీటిని వాడడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


సంస్కృతంలో వీటిని ధాన్యకం అంటారు. అలాగే వీటిని శాస్త్రీయంగా కొరియాండ్రం సెటైవం అని పిలుస్తారు. అలాగే వీటిని హిందీలో ధనియా అని పిలుస్తారు. ధనియాల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయని వీటిని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చని మనలో చాలా మందికి తెలిసి ఉండదు.

జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు బాధపెడుతున్నప్పుడు చాలా మంది మందులను వాడుతూ ఉంటారు. దీని వల్ల కాలేయం కొంతకాలానికి దెబ్బతినే అవకాశం ఉంది.

జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలను మనం ధనియాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. ధనియాలు, పసుపు, పటిక బెల్లాన్ని సమానంగా తీసుకుని బరకగా దంచాలి.

ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక టీ గ్లాస్ నీటిలో వేసి పావు గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయన్ని గోరు వెచ్చగా పూటకు నాలుగు టీ స్పూన్ల మోతాదులో మూడు పూటలా తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే ధనియాలను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాస్ నీళ్లల్లో వేసి అర గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించి తాగాలి.

ఇలా చేయడం వల్ల కూడా జులబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ప్రేగుల్లో పురుగులు, నులి పురుగులు వంటి సమస్యలతో కూడా మనలో చాలా మంది బాధపడతారు.

Coriander Seeds

ముఖ్యంగా పిల్లలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయట పడడంలో ధనియాలు మనకు ఎంతో సహాయపడతాయి. అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో ధనియాల పొడిని తీసుకోవాలి.

ఈ పొడికి కొద్దిగా బెల్లాన్ని కలిపి రోజుకు రెండు పూటలా ఐదు రోజుల పాటు తీసుకోవడం వల్ల ప్రేగుల్లో పురుగులు నశిస్తాయి. చలికాలం, వర్షాకాలం కూడా చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటారు. శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంచడంలో ధనియాలు మనకు ఉపయోగపడతాయి.

ఒక టీ స్పూన్ ధనియాలకు ఒక టీ స్పూన్ పంచదార కలిపి కచ్చా పచ్చాగా దంచాలి. ఒక మిశ్రమాన్ని నాలుగు గ్లాసుల నీటికి కలిపి ఒక గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ కషాయానికి కొద్దిగా ఉప్పును కలపాలి.

ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని నాలుగు టీ స్పూన్ల మోతాదులో రోజుకు నాలుగు నుండి ఐదు సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము.

అదే విధంగా ధనియాలను ఉపయోగించి మనం అజీర్తి సమస్య నుండి బయటపడవచ్చు. ఒక టీ స్పూన్ ధనియాలకు చిటికెడు శొంఠి పొడిని కలిపి మెత్తగా దంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటికి కలిపి పావు గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి.

ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని పూటకు నాలుగు టీ స్పూన్ల మోతాదులో మూడు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గు ముఖం పడుతుంది.

ఈ విధంగా ధనియాలు మనకు ఎంతో ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.