జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ

జపనీస్లో ఉండే ఎవింగెల్లా అమెరికానా అనే చెట్టపై తిరిగే కప్ప గట్ బాక్టీరియాలో క్యాన్సర్తో పోరాడే కారకాలు ఉన్నట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు.


ఇప్పటికే దీంతో తయారు చేసిన మందు ఒక జాతి ఎలుకలలోని కణితులను పూర్తిగా తగ్గించిందని ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని తేల్చారు. జపాన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు పరిశోధనలు చేశారు. ఈ కప్పల నుంచి గట్ బాక్టీరియాను ఎలుకలకు బదిలీ చేయడం వల్ల క్యాన్సర్ నిరోధక ప్రభావాలు ఎలా ఉంటాయో పరీక్షించారు.

కప్పలు, న్యూట్లు బల్లుల సహా మొత్తం 45 వేర్వేరు బాక్టీరియా జాతులను పరీక్ష కోసం షార్ట్లిస్ట్ చేయగా వాటిలో 9 జాతులు బ్యాక్టీరియాలు క్యాన్సర్పై పోరాటంపై విజయం సాధించాయి. అందులో ఎవింగెల్లా అమెరికానా జాతి కప్ప బ్యాక్టరీయా చాలా ప్రభావంతంగా పని చేసినట్టు తేల్చారు. కప్ప కడుపులో ఉన్న బ్యాక్టీరియాపై ఓ జర్నల్కు వ్యాసం రాసిన శాస్త్రవేత్తలు అనేక విషయాలు వెల్లడించారు. అమెరికానా బ్యాక్టీరియాను ప్రయోగించిన ఎలుకల్లో క్యాన్సర్ కణితులు పూర్తిగా మాయం చేసిందని గ్రహించారు. అక్కడితో ఆగిపోలేదు. చికిత్స ఆరోగ్యవంతంగా మారిన ఎలుకల శరీరంలోకి మరోసారి క్యాన్సర్ కణాలు ప్రవేశ పెట్టారు. అయితే అనూహ్యంగా అవి అభివృద్ధి చెందకుండా అదృశ్యమైపోయాయి.

ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు రెండు విషయాలను గ్రహించారు. ఒకటి క్యాన్సర్ కణాలపై అమెరికానా బ్యాక్టీరియా దాడి చేస్తుంది. అదే టైంలో శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతోంది అని తేల్చారు. అంతే కాకుండా కీమో థెరపీ ఔషధాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని తేల్చారు.

జంతువులపై ప్రయోగం తర్వాత అమెరికానా చాలా సురక్షితమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుక రక్త ప్రవాహం నుంచి బ్యాక్టీరియా త్వరగా తొలగిపోయిందని, దీర్ఘకాలిక విష ప్రక్రియకు కారణం కాలేదని తేల్చారు. అవయవాల పనితీరుపై ఎలాంటి దుష్ర్పభావం చూపలేదు. వ్యాధిని తగ్గించడంలో ప్రస్తుతం ఉన్న కిమోథెరపీ ఔషధాల కంటే ఎక్కువ పని తీరు కనబరుస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు జంతువులపై మెరుగైన ఫలితాలు సాధించిన ఈ ప్రయోగం మనుషులపై చేయాల్సి ఉంది. ఇప్పుడు మనుషులపై ఎలా ప్రభావం చూపుతుందో ప్రయోగాలు చేయాలని చూస్తున్నారు. బాక్టీరియల్ చికిత్స క్లినికల్ ట్రయల్స్ వరకు వెళ్లాలంటే చాలా జాగ్రత్తుల తీసుకోవాలి. ముఖ్యంగా మనుషుల భద్రతపై ఎక్కువ ఫోకస్ చేయాలి. అమెరికానా అనేది బాక్టీరియా కాబట్టి ఇది మానవుల్లోని ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పరీక్షలు చేయడం సవాల్తో కూడుకున్నది. శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలను చంపడానికి బ్యాక్టీరియాను సహకరించే ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. మూత్రాశయ క్యాన్సర్ కొన్ని కేసులకు చికిత్స చేయడానికి కనీసం ఒక బ్యాక్టీరియల్ చికిత్సను ఉపయోగిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.