నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది

 నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. చెన్నై (Chennai) నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చినట్లుగా వాతావరణ శాఖ తెలియచేసింది.


దీని ప్రభావంతో నేడు ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్త తెలియచేసింది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో గంటకు 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.