ఉత్తర బంగాళాఖాతంలో సోమవారంలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో గురువారం నాటికి మరో అల్పపీడనమూ ఏర్పడొచ్చని తెలిపింది.
ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారానికల్లా వాయుగుండంగా బలపడుతుందని, శనివారం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
































