ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్తగా లాంగ్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకొచ్చింది. ఈ ప్లాన్లు తరచూ రీఛార్జ్ చేయడం ఇష్టం లేని వాళ్లకు మంచి ఆప్షన్స్.
బీఎస్ఎన్ఎల్ 365 రోజులు, 330 రోజులు, 300 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్లు ఇస్తోంది. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్లలో డేటా, అనలిమిటెడ్ కాలింగ్, రోజువారీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాన్లు అతితక్కువ ధరలో ఎక్కువ కాలం సర్వీస్ కావాలనుకునే వాళ్లకు బెస్ట్.
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల వాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ ధర
ఈ రూ.2399 ప్లాన్ పూర్తి 365 రోజుల వాలిడిటీ ఇస్తుంది. రోజుకు 2.5 GB హైస్పీడ్ డేటా వస్తుంది. రోజువారీ డేటా అయిపోయాక నెట్ స్పీడ్ 40kbps కి తగ్గుతుంది. ఇండియా మొత్తం అనలిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ ఫ్రీగా పంపవచ్చు. ఎక్కువ ఇంటర్నెట్ వినియోగించే వాళ్లకు ఈ ప్లాన్ సూపర్. ఒక్కసారి ఈ ప్లాన్ తీసుకుంటే సంవత్సరం మొత్తం తరచూ రీఛార్జ్ చేయనవసరం లేదు.
బీఎస్ఎన్ఎల్ రూ.1999 రీఛార్జ్ ప్లాన్ 330 రోజుల వాలిడిటీ
రూ.1999 ప్లాన్‌లో 330 రోజుల సర్వీస్ వాలిడిటీ ఉంది. రోజుకు 1.5 GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. డేటా లిమిట్ అయిపోయాక స్పీడ్ 40kbps కి తగ్గిపోతుంది. అన్ని నెట్‌వర్క్‌లకు అనలిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్ ఫ్రీ. ఇంటర్నెట్ అవసరం మేరుకు మాత్రమే వినియోగించే వాళ్లకు ఇది సరిపోతుంది. ఎక్కువ వాలిడిటీతో సరసమైన డేటా బెనిఫిట్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి.
బీఎస్ఎన్ఎల్ రూ.1499 రీఛార్జ్ ప్లాన్ 300 రోజుల వాలిడిటీ
ఈ రూ.1499 ప్లాన్ 300 రోజుల వాలిడిటీ ఇస్తుంది. మొత్తం 32 GB హైస్పీడ్ డేటా వస్తుంది. డేటా అయిపోయాక నెట్ స్పీడ్ 40 kbps కి తగ్గిపోతుంది. అన్ని నెట్‌వర్క్‌లకు అనలిమిటెడ్ ఫ్రీ కాలింగ్ ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ ఫ్రీ. తక్కువ డేటా వినియోగించే వాళ్లకు, ముఖ్యంగా కాల్స్ ఎక్కువ చేసేవాళ్లకు ఇది మంచి ఆప్షన్. అప్పుడప్పుడు బ్రౌజింగ్ చేస్తే చాలు.
బీఎస్ఎన్ఎల్ లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్లు ఎందుకు ఎంచుకోవాలి
ఈ ప్లాన్లతో నెలనెలా రీఛార్జ్ చేసే ఇబ్బంది తప్పుతుంది. ఎక్కువ కాలం స్థిరమైన సర్వీస్ లభిస్తుంది. కాలింగ్, ఎస్ఎంఎస్ రోజువారీ లిమిట్ గురించి ఆలోచించనవసరం లేదు. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల వాళ్లకు ఇవి బెస్ట్ ప్లాన్స్. ముఖ్యంగా వాయిస్ కాలింగ్ ఎక్కువ ఉపయోగించేవారికి సూట్ అవుతాయి. బీఎస్ఎన్ఎల్ ఇండియా మొత్తం నెట్‌వర్క్ విస్తరిస్తోంది. ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే ధరలు చవకగా ఉంటాయి.
ఈ ప్లాన్లు ఎంచుకునేముందు గమనించాల్సిన ముఖ్య విషయాలు
డేటా లిమిట్ అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ చాలా తగ్గుతుంది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కవరేజ్ ప్రాంతం ప్రకారం మారవచ్చు. రీఛార్జ్ చేసేముందు మీ ఏరియాలో నెట్‌వర్క్ చెక్ చేసుకోండి. ప్లాన్ వాలిడిటీ అంతా బెనిఫిట్స్ యాక్టివ్‌గా ఉంటాయి. ఇండియాలో రోమింగ్ ఛార్జీలు లేవు.
బీఎస్ఎన్ఎల్ లాంగ్ వాలిడిటీ ప్లాన్లు చవక ధరలో మంచి సౌకర్యం ఇస్తాయి. మార్కెట్‌లో టాప్ ప్రైవేట్ ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్ కంటే తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ మంచి బెనిఫిట్స్ అందిస్తోంది. మీ డేటా అవసరాలు, వాడకం ప్రకారం ప్లాన్ ఎంచుకోవచ్చు. లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ యూజర్లకు ఇవి బెస్ట్.


































