ప్రస్తుతం జనాలను ఎంటర్ టైన్ చేసే వాటిల్లో సినిమాలు ప్రధానమైనవి. థియేటర్, ఓటీటీ వంటి వాటి వేదికగా సినీ లవర్స్ ఎంటర్ టైన్ అవుతుంటారు. వారం వారం కొత్త కొత్త సినిమాలను చూస్తేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..సినిమా రేట్ల వంటి వాటి విషయంలో ప్రభుత్వాలు తరచూ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. కొన్ని సినీ ప్రియులకు శుభవార్తలుగా ఉంటే మరికొన్ని మాత్రం షాకిచ్చేవిలా ఉంటాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్నా ఓ నిర్ణయం సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సినిమా టికెట్ల ధరలు, ఓటీటీ సబ్ స్క్రీప్షన్ ధరలు పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మూవీ లవర్స్ కు గట్టి షాకిచ్చేందుకు సిద్ధమైంది. సినీ,సాంస్కృతి కళకారులను ఆదుకునేందుకు సినిమా టికెట్ల, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ధరలు పెంచేందుకు సిద్దపడింది. ఈమేరకు వీటిపై కొత్త పన్ను విధించాలనే కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది. ఈ రెండిటిపై 1 నుంచి 2 శాతం వరకు సెస్ విధించాలనే ఆలోచనల కర్ణాటక ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలే సినీ, సాంస్కృతిక కార్మికుల బిల్లును శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
కొత్తగా పెంచిన పన్నుల ద్వారా వచ్చే అదనపు నిధులను సినీ, సాంస్కృతిక కళాకారులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్టు ఆ బిల్లులో పేర్కొన్నారు. కళాకారుల పిల్లకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ఈ బిల్లును ఆమోదింప చేసుకోవాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది. సినిమా టికెట్లు, సబ్స్క్రిప్షన్ ఫీజులు, ఇతర రెవెన్యూలపై సెస్‌ని విధిస్తామని, దీనిని సినీ- సాంస్కృృతిక కార్యకర్తల సంక్షేమ సెస్‌గా పిలుస్తామని, అలానే సెస్ 2శాతానికి మించదని, అదేవిధంగా ఒక శాతం కన్నా తక్కువ ఉండదని బిల్లు స్పష్టం చేసింది.
ఈ బిల్లు చట్టంగా మారితో అమల్లోకి వస్తే..సినీ ప్రియులపై భారం పడనుంది. ఇప్పటికే మూవీ బట్టి టికెట్ రేట్లు మారిపోతున్నాయి. ఇప్పటికే బెంగళూరు వంటి నగరాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ నిర్ణయం కన్నడ సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావంత చూపనుందో, థియేటర్, వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులు ఎంత వరకూ ఆమోదిస్తారో చూడాలి. ఇప్పటికే ఉద్యోగ రిజర్వేషన్ల బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 50 శాతం, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రతిపాదనను కర్నాటక ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులకే సినిమా టికెట్లు, ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ చోటు చేసుకోవడం గమనార్హం.