గూగుల్ నుంచి మనకు సర్ ప్రైజ్ గిఫ్ట్- అన్నీ ఇక్కడే

గూగుల్ భారతదేశంలో సెర్చ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేందుకు అడుగులు వేసింది. సాంప్రదాయ సెర్చ్ స్థానంలో ఇప్పుడు గూగుల్ యొక్క శక్తివంతమైన జెమిని మోడల్‌పై ఆధారపడిన AI మోడ్ రాబోతోంది. మీరు గూగుల్‌లో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, కేవలం లింక్‌లు మాత్రమే కాకుండా, మీ భాషలో ఆ ప్రశ్నకు సంబంధించిన పూర్తి సమాధానం లభిస్తుంది.


గూగుల్‌ కు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, దానికి సంబంధించిన లింక్స్ మాత్రమే కాకుండా, ఆ ప్రశ్నతో ముడిపడి ఉన్న అన్ని అంశాలన్నింటిపై కూడా పూర్తిస్థాయిలో సమాధానాలను తెలియజేస్తుంది. అది కూడా మనం ఎంచుకున్న భాషలోనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఏఐ సెర్చ్ ఎలా మారుతుంది?

ఇప్పటివరకు ఒకే ప్రశ్నకు సమాధానంగా సంక్షిప్త సారాంశాన్ని, సంబంధిత ముఖ్యమైన విషయాలు, విశ్వసించదగ్గ వెబ్‌ సైట్ల లింక్‌ లను యూజర్లకు ఇస్తూ వస్తోంది గూగుల్. దీనికి భిన్నంగా పూర్తిస్థాయి సమాచారాన్ని యూజర్ల చేతిలో ఉంచబోతోంది.

ఉదాహరణకు- డయాబెటిస్‌ కు ఇంటి చిట్కాలు.. అని అడిగితే.. వెంటనే గూగుల్- దీనికి సంబంధించిన చికిత్స విధానాలు, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిపుణుల వెబ్‌సైట్‌ ల సమాచారం ఒకేసారి అందజేస్తుంది.

ఏఐ మోడ్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటుంది. దానికి అందుబాటులో ఉన్న పూర్తి సమాచారాన్ని మనకు అందిస్తుంది. ఢిల్లీలో చిన్న పిల్లల కోసం పర్యాటక ప్రదేశాలు గానీ, ఎంటర్టైన్మెంట్ కేంద్రాలు గానీ ఏమున్నాయని గూగూల్ ను ప్రశ్నిస్తే- ఆ సమాచారం మాత్రమే కాకుండా.. దగ్గరలో ఇంకా ఏఏ ప్రదేశాలు ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఢిల్లీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన ముందు ఉంచుతుంది.

మల్టీమోడల్ పవర్ ఇప్పుడు మీరు టెక్స్ట్‌తో పాటు ఫోటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు, ఒక టాబ్లెట్ ఫోటోను పంపి “ఇది ఏ వ్యాధికి సంబంధించినది?” అని అడిగితే, AI సమాధానం ఇస్తుంది. టెక్స్ట్ టు స్పీచ్ అంతేకాకుండా టెక్స్ట్ టు స్పీచ్ ద్వారా సమాధానం వినే అవకాశం కూడా ఉంది. ఏఐ మోడ్ ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. టెక్స్ట్‌తో పాటు ఫొటోలను అప్‌ లోడ్ చేయడం ద్వారా కూడా గూగుల్ జెమిని ఏఐకి మనం ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు- ఒక టాబ్లెట్ చిత్రం పంపి ఇది ఏ వ్యాధికి సంబంధించినది? అని అడిగితే- ఏఐ సమాధానం ఇస్తుంది.

కేస్ స్టడీ 1 హైదరాబాద్ కు చెందిన సుబ్రహ్మణ్యం అనే 56 ఏళ్ల వ్యక్తికి హైబీపీ ఉందనుకుందాం. ఆయన తరచుగా డాక్టర్‌ ను కలవలేకపోవచ్చు. ఇప్పుడు గూగుల్‌లో హైబీపీ ఉన్నప్పుడు ఏ ఆహారాన్ని స్వీకరించాలి? అని గూగుల్ ఏఐ మోడ్ ను అడిగితే వెంటనే తక్కువ ఉప్పు, ఆకు కూరగాయలు తీసుకోవాలి. తరచూ వ్యాయామం చేయాలని సూచిస్తుంది. అంతేకాకుండా డాక్టర్ల వెబ్‌సైట్‌లకు లింక్‌లను కూడా ఇస్తుంది.

కేస్ స్టడీ 2 విశాఖపట్నానికి చెందిన 19 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్.. ఏఐ వర్సెస్ మెషిన్ లెర్నింగ్ మధ్య గల తేడాను తెలుసుకోవాలనుకున్నాడు. దీని గురించి గూగుల్ ఏఐని అడిగితే వెంటనే- బుల్లెట్ పాయింట్లలో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తుంది. దీంతోపాటు యూట్యూబ్ వీడియోలు, వికీపీడియా లింక్‌లను కూడా అందిస్తుంది. AI మోడ్‌ను ఎలా ప్రారంభించాలి? ఏఐ మోడ్‌ను అందుబాటులోకి తెచ్చుకోవాలంటే తొలుత- గూగుల్ యాప్‌కు వెళ్లాలి. పైన ల్యాబ్స్ అనే సింబల్ కనిపిస్తుంది. ఇది సెర్చ్ ల్యాబ్స్‌. దీన్ని ఆన్ చేయాలి. ఏఐ ఓవర్‌ వ్యూస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీనితో గూగుల్ ఏఐ మోడ్ ఆన్ అవుతుంది. ఆ తరువాత మనకు అవసరమైన ప్రశ్నలను అడగవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.