శబరిమల వద్ద ట్రాక్టర్ ప్రమాదం.. తొమ్మిది మంది భక్తులకు గాయాలు

 శబరిమల (Sabarimala) సన్నిధానం వద్ద శనివారం సాయంత్రం 6:10 గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. కొండ దిగుతున్న భక్తుల గుంపుపైకి వ్యర్థాలను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది.


ఈ ఊహించని ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం తొమ్మిది మంది భక్తులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన భక్తులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని సమాచారం అందుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, స్థానిక అధికారులు గాయపడిన భక్తులను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. తొమ్మిది మంది గాయపడినప్పటికీ, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ భక్తులు ఎంత మంది గాయపడ్డారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శబరిమల యాత్రికుల రద్దీ సమయంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలయ భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చకు దారితీసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.