గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు మరణానికి ముందు ఈ 6 రహస్య సంకేతాలను పంపిస్తాడు, నీడ కూడా వదిలేస్తుంది!

గరుడ పురాణాన్ని పఠించేటప్పుడు శుభ్రమైన ప్రదేశంలోనే కూర్చోవాలి. ప్రతి ఒక్కరికీ పుట్టుక, చావు ఉంటాయి. అయితే చనిపోయే ముందు మాత్రం కొన్ని సంకేతాలను చూస్తారు. చనిపోయే ముందు ఒక వ్యక్తి ముందు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. మరి చనిపోయే ముందు గరుడ పురాణం ప్రకారం ఎలాంటి సంకేతాలు కనపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలి. అయితే మనకు ఉన్న 18 మహాపురాణాల్లో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణం ప్రకారం తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. మరణించిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందట. గరుడ పురాణం పారాయణం చేస్తే ఆత్మకు శాంతి కలుగుతుంది, మోక్షం లభిస్తుంది. గరుడ పురాణాన్ని విష్ణువు తన వాహనమైన గరుడుడికి చెప్పాడు. కనుక గరుడ పురాణం అనే పేరు వచ్చింది.


జీవిత సత్యాలను, మరణం తర్వాత రహస్యాలను తెలుసుకోవడానికి గరుడ పురాణాన్ని చదువుతారు. గరుడ పురాణాన్ని చదివేటప్పుడు శుభ్రమైన దుస్తులు ధరించి, ఏకాగ్రతతో చదవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే మాత్రమే గరుడ పురాణాన్ని చదవాలి.

గరుడ పురాణాన్ని పఠించేటప్పుడు శుభ్రమైన ప్రదేశంలోనే కూర్చోవాలి. ప్రతి ఒక్కరికీ పుట్టుక, చావు ఉంటాయి. అయితే చనిపోయే ముందు మాత్రం కొన్ని సంకేతాలను చూస్తారు. చనిపోయే ముందు ఒక వ్యక్తి ముందు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. మరి చనిపోయే ముందు గరుడ పురాణం ప్రకారం ఎలాంటి సంకేతాలు కనపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు ఈ సంకేతాలు కనపడతాయి

  1. గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు వారి నీడను వారు చూసుకోలేరు. నీళ్లలో, నూనెలో లేదా అద్దంలో కూడా వారు తమ రిఫ్లెక్షన్‌ను చూసుకోవడానికి వీలు ఉండదు.
  2. అలాగే గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు ఆ వ్యక్తి చనిపోయిన పూర్వీకులను లేదా బంధువులను చూస్తారు.
  3. కలలో లేదా మెలకువగా ఉన్నప్పుడు చనిపోయిన వారు కనపడుతూ ఉంటారు. అలాగే చనిపోయే ముందు వారు సంతోషంగా వీరిని పిలుస్తున్నట్లుగా కూడా కనపడుతుంది.
  4. యమభటులు కూడా చనిపోయే ముందు కనపడతారు. యమభటులు పక్కన వారి నీడ ఉన్నట్లుగా కనపడుతుంది. దీంతో వారికి భయం లేదా కాస్త వింతగా అనిపిస్తుంది. నెగటివ్ ఎనర్జీ కూడా వారి చుట్టూ వ్యాపిస్తుంది.
  5. అలాగే చనిపోయే ముందు వారి జీవితమంతా ఒక సినిమా మాదిరిగా కనపడుతుంది. ఆ సమయంలో వారు జీవితంలో చేసిన మంచి, చెడును చూస్తారు. కొన్నిటి ద్వారా సంతృప్తి చెందితే, కొన్నిటి వల్ల బాధపడతారు.
  6. గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు చేతిపై ఉన్న గీతలు నెమ్మదిగా మాయమైపోతాయి. కొన్ని గీతలు అయితే పూర్తిగా కనిపించవు. ఇలా చనిపోయే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.