డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు… ఫిబ్రవరి 19లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ లో వివరాలు తెలుసుకోవచ్చు.
5వ తరగతిలో అడ్మిషన్ కోసం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు.వీరు ఫిబ్రవరి 19వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులను కూడా ఎంపిక చేస్తారు.
ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు టెన్త్ పాసై ఉండాలి. లేదా ప్రస్తుతం పదో తరగతి చదవుతున్న విద్యార్థులు అర్హులవుతారు. వీరు కూడా ఫిబ్రవరి 19వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి.
AP BRAGCET 2026 – అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగాhttps://apbragcet.apcfss.in/వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఐదో తరగతి అడ్మిషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ విద్యార్థి ఆధార్ నెంబర్, పేరు, రిజర్వేషన్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. పూర్తి వివరాలను ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫారమ్ పొందవచ్చు.
- రిజిస్ట్రేషన్ నెంబర్ సాయంతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
AP BRAGCET 2026లో భాగంగా 5వ తరగతి ఎంట్రెన్స్ కోసం 50 మార్కులకు గానూ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ పై ప్రశ్నలుంటాయి. 2 గంటల సమయం ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు మీడియతో ఎగ్జామ్ ఉంటుంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం కూడా ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకుగానూ నిర్వహిస్తారు. గణితం, ఫిజిక్స్, బయాలజీ, సామాజిక అధ్యయనాలు, ఇంగ్లీశ్, లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలుంటాయి. మొత్తం 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. పదో తరగతి స్థాయిలోప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానికి 1/4 మార్క్ తీసివేస్తారు.ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో ప్రశ్నాపత్రం ఇస్తారు. విద్యార్థులు సాధించే స్కోర్, ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.

































