తండ్రిపై మమకారం.. పంట మొత్తం పక్షులకు ఆహారం

అన్నమయ్య జిల్లా సింగనవారిపల్లెకు చెందిన పాలేటి శివాజీ ‘ఎకో సేవియర్స్‌’ పేరిట పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. చెట్ల పెంపకం, పక్షులకు ఆహారం పెట్టడం, ప్లాస్టిక్‌ రహిత తిరుపతికి కృషి చేస్తున్నారు. వీటిపై నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. శివాజీ తండ్రి వెంకట సుబ్బయ్య మరణించి ఏడాదవుతోంది. దీంతో ఆయన జ్ఞాపకార్థం ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఏదైనా చేయాలని భావించారు. పక్షులకు ఆహారం అందించే ఉద్దేశంతో సజ్జ పంట వేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు స్వగ్రామంలో తనకున్న రెండెకరాల అరటి తోటను పూర్తిగా తొలగించి రెండున్నర నెలల కిందట సజ్జ వేశారు. తాజాగా పంట చేతికి రావడంతో మొత్తాన్ని పక్షులకు ఆహారంగా వదిలేశారు. సేంద్రియ విధానంలో సాగు చేయడంతో పెద్దసంఖ్యలో పక్షులు వాలుతున్నాయి.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.