అలెర్ట్: రేపు, ఎల్లుండి జాగ్రత్త.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు!

మే నెల మొదటి వారంలో భానుడి ప్రతాపం మాములుగా లేదు. నిప్పుల కొలిమి మీద నడుస్తున్నామ అన్నట్లు ఎండల తీవ్రత్త ఎక్కువగా ఉండేది. అయితే కొన్ని రోజుల నుంచి వర్షాలు పడటంతో వాతావరణ చల్లబడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్తా ఉపశమనం లభించింది. అయితే మరోసారి ఎండలు విజృంభించనున్నాయి. రానున్న రెండు రోజుల్లో ఎండలు తీవ్ర స్థాయిలో ఉండనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని సూచించింది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చిన్నపాటి వర్షంతో కాస్తా వాతావరణం చల్లబడింది. అయితే తిరిగి మరోసారి ఎండలు తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాయి. రెండు రోజుల నుంచి పగలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే ఎంతో ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికి రానున్న రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

మంగళ, బుధవార్లో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఎండలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాలో రానున్న 48 గంటలు తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని స్పష్టం చేసింది. రేపు 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వృద్ధులు , గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు తిరుపతి జిల్లాలోని సత్యవేడులో 41.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలోని మనుబోలులో 41.5, బాపట్ల జిల్లాలోని వేమురూలు, కృష్ణా జిల్లాలోని పెడనలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాబోయే రెండు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు చేసింది. పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. మొత్తంగా రానున్న రెండు రోజులు ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎండల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రాణాలకే ప్రమాదమని అధికారులు సూచిస్తున్నారు.