Shokalu for kids: మీ పిల్లలకు ఈ శ్లోకాలు నేర్పించండి.. జీవితంలో దేనికి భయపడరు, ఓటమి అనేది ఎరుగరు

Shokalu for kids: నేటి తరం పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాల గురించి తల్లిదండ్రులు తప్పనిసరిగా వివరించాలి. సంప్రదాయ నృత్యాల నుండి ప్రతిరోజు పఠించే శ్లోకాలు, మంత్రాల వరకు అన్ని నేర్పించడం వల్ల వారికి మంచి జరుగుతుంది.


జీవితంలో ఎటువంటి పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఓటమిని చూసి భయపడరు. దైవ ఆశీస్సులు లభిస్తాయి. సులభంగా నేర్చుకోగలిగే, హృదయానికి దగ్గరగా ఉండే కొన్ని మంత్రాలు, శ్లోకాలు ఉన్నాయి. వీటిని పిల్లలకు నేర్పించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. వాళ్లు ధైర్యంగా ఉండగలుగుతారు. ప్రతి పనిని పూర్తి సామర్థ్యంతో చేస్తారు. పిల్లలకు నేర్పించాల్సిన అత్యంత శక్తివంతమైన సంస్కృత శ్లోకాలు ఇవి.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ |

అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ||

భగవద్గీతలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన అర్థవంతమైన శ్లోకాలలో ఇది ఒకటి. ఎప్పుడైతే ధర్మం నశించి, అధర్మం పెరుగుతుందో ఆ సమయంలో భూమిపై అవతరిస్తానని శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పాడు. భగవద్గీత లోని ఈ శ్లోకం చాలా సులభంగా పఠించవచ్చు. ధర్మంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని పిల్లలకు నేర్పించాలి. సమాజంలో విలువలు, నైతికత అనేవి వారికి నేర్పించాలి.

వక్రతుండ్ మహాకాయ సూర్యకోటి సంప్రభ |

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ।।

శివుడి కుమారుడైన గణేశుడికి అంకితం చేసిన శ్లోకం ఇది. పనులన్నింటిలోనూ ఉన్న అడ్డంకులను తొలగించమని కోరుకుంటూ వినాయకుడిని పూజిస్తూ ఈ శ్లోకం జపించడం మంచిది. ఎందుకంటే అడ్డంకులను తొలగించేవాడిగా వినాయకుడిని పిలుస్తారు. ఏదైనా కొత్త పని లేదా పరీక్షల సమయంలో ఈ ప్రార్థన చేసుకోవడం వల్ల గణేశుడి ఆశీస్సులు లభిస్తాయి. ఎటువంటి హాని జరగకుండా, అడ్డంకులు రాకుండా మీ చదువు సక్రమంగా సాగుతుంది. ఈ శ్లోకం మనిషి చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతం అయ్యేలా చేసేందుకు భగవంతుడిని కోరే శక్తివంతమైన ప్రార్థన. ఈ శ్లోకాన్ని పిల్లలకు బోధించడం వల్ల ఏదైనా పనిని ప్రారంభించేముందు దేవుడు ఆశీర్వాదం తీసుకోవాలని వారికి నేర్పించడం.

అసతో మా సద్గమయ

తమసో మా జ్యోతిర్గమయ ।

మృత్యోర్మ అమృతం గమయ..||

పాఠశాలలో పిల్లలకు తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని నేర్పిస్తారు. తరగతి ప్రారంభమయ్యే ముందు ఈ శ్లోకం పఠిస్తారు. అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుండి వెలుగులోకి, మరణం నుండి అమృతం వైపు నడిపించమని కోరుకుంటూ ఈ శ్లోకాన్ని జపిస్తారు. జ్ఞానోదయం, విముక్తిని అందించమని దేవుళ్ళని అభ్యర్థించడం ఈ శ్లోకం అర్థం. ఇది మనల్ని జ్ఞానమార్గంలో నడిపించడానికి నిరాశ నుంచి ఆశకు మరణ భయం నుండి విముక్తి కలిగిస్తుంది.

సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే ।

శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణి నమోయస్తుతే ।।

ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ శ్లోకాన్ని వినే ఉంటారు. బలం రక్షణ ఇవ్వమని కోరుకుంటూ తమ కోరికలను తీర్చమంటూ దేవతలను వేడుకోవడం. దుర్గామాతకు అంకితం చేసిన ఈ శ్లోకం పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలి . ఎందుకంటే ఇది వారి మనసులో రక్షణ భావాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఈ మంత్రం సంక్షేమం, విజయం కోసం దీవెనలు ఇవ్వమని అమ్మవారిని వేడుకోవడం.

గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వరః |

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

చిన్నతనం నుంచి పిల్లలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ ఈ శ్లోకం అంకితం. హిందూమతంలో గురువు భగవంతుని కంటే ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటాడని చెప్తారు. ఈ శ్లోకం ఆ నమ్మకాన్ని సంగ్రహిస్తుంది. ఒకరి జీవితంలో గురువు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. అక్షరాలు నేర్పించడం నుంచి జీవిత పాఠాలు బోధించడం వరకు గురువు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అందుకే ప్రతిరోజు గురువును కలిసినప్పుడు పిల్లలు ఈ శ్లోకం జపిస్తూ నమస్కరించడం మంచిది. ఉపాధ్యాయులు పిల్లలకు మార్గదర్శకులుగా ఉంటూ, జ్ఞానాన్ని అందిస్తారు.

కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోయస్త్వకర్మాణి ।।

భగవద్గీతలోనే మరొక అర్థవంతమైన శ్లోకం ఇది. ఈ శ్లోకం ఒకరు తాము చేస్తున్న పనులు, బాధ్యతలపై దృష్టి పెట్టడం గురించి బోధిస్తుంది. ఏదైనా పని చేపడితే అది ఎంత ఫలవంతంగా ఉంటుంది, మనకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుందో వివరిస్తుంది. బాధ్యతా భావాన్ని కలిగిస్తుంది. కష్టపడి పని చేయమని చెబుతుంది