చాలామంది తమకు సొంతంగా స్థలం ఉండాలని కోరుకుంటారు. కాస్త డబ్బు రాగానే మిగతా మిగతా మొత్తాన్ని లోన్ లేదా వద్ద అప్పుచేసి స్థలాన్ని కొనుగోలు చేస్తారు. సొంత ఇల్లు ఉండాలని కోరికతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఆ తర్వాత ఇల్లు నిర్మించుకుంటారు. అయితే..
చాలామంది తమకు సొంతంగా స్థలం ఉండాలని కోరుకుంటారు. కాస్త డబ్బు రాగానే మిగతా మిగతా మొత్తాన్ని లోన్ లేదా వద్ద అప్పుచేసి స్థలాన్ని కొనుగోలు చేస్తారు. సొంత ఇల్లు ఉండాలని కోరికతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఆ తర్వాత ఇల్లు నిర్మించుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో సొంత స్థలం కొనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాదులో హైడ్రా ఏర్పడిన తర్వాత ఎటువంటి స్థలాలు కొనుగోలు చేయాలో చాలామంది ఆలోచనలు పడ్డారు. ఇక్కడి వారైనా కొత్తగా స్థలం కొనుగోలు చేసే విషయంలో ఐదు విషయాలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఐదు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఆ స్థలాన్ని కొనుగోలు చేయవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు తెలుపుతున్నారు. మరి ఏంటి ఆ ఐదు విషయాలు?
ఒక స్థలం కొనుగోలు చేసేముందు ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయా? లేవా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది స్థలం కొనుగోలు చేసిన సమయంలో సాధారణ పేపర్ పై మాత్రమే రాసుకుంటారు. ఇలా ఉంటే మాత్రం ఒకరికి తెలియకుండా మరొకరు స్థలం విక్రయించే ప్రమాదం ఉంది. అందువల్ల కొనుగోలు చేసే స్థలం సేల్స్ కరెక్ట్ గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. వీలైతే స్థలం కొనుగోలు చేసేముందు సేల్ డీడ్ సంబంధించిన పత్రాలను జిరాక్స్ ఇవ్వాలని కోరాలి. వాటిని చెక్ చేసుకున్న తర్వాతనే స్థలం కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకోవాలి.
స్థలం కొనుగోలు చేసే విషయంలో లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉన్నాయా? లేవా? అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే కొందరు ఒక ఒక స్థలంను ఒకరితోపాటు చాలామందికి విక్రయించే అవకాశం అయితే లింకు డాక్యుమెంట్ల ద్వారా ఈ స్థలం ఎంత మంది కొనుగోలు చేశారు? కొనుగోలు చేసిన వారంతా సరైన సమయంలోనే విక్రయించారా? అనే విషయాలను పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల స్థలం కొనుగోలు విషయంలో లింక్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా చూసుకోవాలి.
ఒక స్థలం కొనుగోలు చేసే సమయంలో ఎంబార్స్మెంట్ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇందులో స్థలానికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. స్థలం సంబంధించిన కొలతలు, ఇతర వివరాలు అన్ని ఆన్లైన్లో ఉంటాయి. డాక్యుమెంట్ కు సంబంధించిన నెంబర్ను ఇస్తే మీసేవ లేదా కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈసీకి సంబంధించిన కాపీని ఇస్తారు. దీనిని నిపుణులకు చూపించిన తర్వాతే స్థలం కొనుగోలు చేసేందుకు ముందుకు వెళ్లాలి.
ఇక కొత్తగా స్థలం కొనుగోలు చేసేవారు ఆ ఏరియాలో అనుమతులు వస్తాయా? లేదా అనే విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఏరియాలో FTL స్థలాలు ఉంటాయి. ఈ స్థలాలు కొనుగోలు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు పడతారు. అందువల్ల స్థలం కొనుగోలు చేస్తే ఆ తర్వాత జరిగే ఇబ్బందులు ఏంటో ముందే తెలుసుకోవాలి.
ఇక చివరగా స్థలం Rera యాక్ట్ కింద విక్రయించారా లేదా అనేది తెలుసుకోవాలి. ఇది రేరా యాక్ట్ కింద ఉంటేనే స్థలం కొనుగోలు చేసేందుకు ముందుకు వెళ్లాలి. లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
































