ఈ అక్క ఏకంగా రైల్వే ట్రాక్ ల మీదే కారు నడిపింది..ఇంతకీ ఆమె ఏ స్థితిలో ఉందో తెలుసా

Car On Railway Tracks రైల్వే ట్రాక్ ల మీద రైళ్లు మాత్రమే నడవాలి. మిగతా వాహనాలు ఏవి నడిచినా రైల్వే అధికారులు ఒప్పుకోరు. కానీ ఈ అక్క అందుకు భిన్నంగా చేసింది. రైల్వే శాఖ నిబంధనలతో నాకు పని ఏముందని ఏకంగా తెగించేసింది. ఇప్పుడు ఆమె చేసిన పని సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

హైదరాబాద్ నగర్ శివారులో కొండకల్ ప్రాంతం మీదిగా రైల్వే ట్రాక్ వెళుతూ ఉంటుంది. ఇది శంకర్పల్లి ప్రాంతాన్ని కలుపుతూ ఉంటుంది. శంకర్పల్లి ప్రాంతం మీదుగా అనేక రైళ్లు రైల్వే ట్రాక్ పై పరుగులు తీస్తూ ఉంటాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు గార్డులు పర్యవేక్షిస్తూ ఉంటారు. పైగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న పైత్యం వల్ల ట్రాక్ ల పై రైల్వే శాఖ పర్యవేక్షణను మరింత తీవ్రతరం చేసింది. ఇటీవల కాలంలో శంకర్పల్లి ప్రాంతంలో కొంతమంది యువకులు రీల్స్ పిచ్చితో రైల్వే ట్రాక్ల మీద రకరకాల ప్రయోగాలు చేశారు. వీటి నిరోధానికి చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారుల నుంచి కింది స్థాయికి సిబ్బందికి ఆదేశాలు రావడంతో.. వారు ఈ ప్రాంతంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. రైల్వే ట్రాక్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలా రైల్వే ట్రాక్లను పర్యవేక్షిస్తున్న సిబ్బందికి ఒక దృశ్యం షాక్ కు గురి చేసింది. దీంతో వారు ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత తేరుకొని హెచ్చరికలు జారీ చేశారు. రైల్వే ట్రాక్ మీద దూసుకు వస్తున్న కారును ఆపారు.


కొండకల్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద ఓ యువతి కారును నడిపింది. వాస్తవానికి రైల్వే ట్రాక్ మీద రైళ్లు మినహా మిగతా వాహనాలను నడపడానికి అవకాశం ఉండదు. రైల్వే శాఖ నిబంధనలు కూడా అందుకు ఒప్పుకోవు. కానీ ఓ యువతి మాదక ద్రవ్యాలు అధికంగా స్వీకరించి.. ఆ మత్తులో కారును నడిపింది. పైగా రైల్వే ట్రాక్ మీద తీసుకువచ్చింది. దీంతో అక్కడే ఆ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న సిబ్బందికి ఆ పరిణామం షాక్ లాగా అనిపించింది. అప్పటికి వారు వారిస్తున్నప్పటికీ ఆమె ఏమాత్రం వినిపించుకోలేదు. పైగా అదే వేగంతో కారును నడిపింది. చివరికి సిబ్బంది కష్టపడి ఆ కారణం నిలుపుదల చేశారు. ఆ తర్వాత ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ కారును బయటకు తీశారు. ఆమెను పరీక్షించగా మాదకద్రవ్యాలు ఎక్కువ మోతాదులో తీసుకొని.. తీవ్రమైన మత్తులో ఉందని గుర్తించారు. తర్వాత ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. మాదకద్రవ్యా లు ఎక్కువ మోతాదులో తీసుకొని ఆమె ఇలా చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పనిచేయడానికి ఆమెకు సిగ్గు లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఆమెను చూస్తుంటే విద్యావంతురాలి లాగా కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. అయితే అంతటి మత్తులో కారును నడిపి.. రైల్వే శాఖ సిబ్బందిని ఆమె తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఒకవేళ సిబ్బంది గనుక ఆమెను చూసి ఉండకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేది. కారు నడుపుతున్నప్పుడు ఆమె విపరీతమైన మత్తులో ఉందని రైల్వే సిబ్బంది చెబుతున్నారు. పైగా ట్రాక్ మీద కూడా కారును విపరీతమైన వేగంతో నడిపిందని.. ఆ క్షణంలో ఏదైనా రైలు కనుక ఎదురుగా వస్తే ఘోరమైన ప్రమాదం సంభవించేదని రైల్వే శాఖ సిబ్బంది చెబుతున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.