అద్దెకు ఉండేవారికి, ఓనర్లకు అలర్ట్.. రూల్స్ మారాయ్.. ఇక 12 నెలల తర్వాతే.

ప్రస్తుతం ఉద్యోగాలు చేసే వారిలో చాలా మంది అద్దెకు ఉంటున్నారు. ఉన్న ఊరిని విడిచి పట్టణాలకు వచ్చి రెంటుకు ఉంటూ ఉపాధి పొదుతున్నారు.


అద్దెలకు సంబంధించి యజమానులతో సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో కొన్నిసార్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే, ఇకపై అలా ఉండదు. ఇంటి రెంట్ కొత్త రూల్స్ 2025 అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అద్దెకు ఉండే వారితో పాటు ఇంటి యజమానులకు నయా రూల్స్ విధించింది. ప్రతి ఒక్కటి రూల్ ప్రకారం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కొత్త రూల్స్ ద్వారా అద్దెకు ఉండే వారికి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. మరి ఎలాంటి రూల్స్ మారాయో తెలుసుకుందాం.

కొత్త రూల్స్ ఇవే

  • ఇకపై రెంట్ అగ్రిమెంట్ పూర్తిగా ఆన్‌లైన్‌లో డిజిటల్ స్టాంప్ కలిగి ఉండాలి. 60రోజుల్లోపు పూర్తి చేయాలి. ఇకపై ఎలాంటి పేపర్ కాంట్రాక్ట్ ఉండదు.
  • సెక్యూరిటీ డిపాజిట్ ఇంటి కోసం అయితే గరిష్ఠంగా 2 నెలల అద్దె మాత్రమే తీసుకోవాలి. అదే వాణిజ్య స్థలాలు అయితే గరిష్ఠంగా 6 నెలల రెంటు డిపాజిట్ చేసుకోవచ్చు.
  • ఇంట్లోకి వచ్చాక 12 నెలలు దాటిన తర్వాతే రెంటు పెంచాలి. అది కూడా 90 రోజులు ముందే సమాచారం అందించాలి.
  • ఏవైనా ప్రధాన మరమ్మతులు చేయాలని అద్దెకు ఉండేవారు ఫిర్యాదు చేస్తే ఇంటి యజమానులు వాటిని 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. లేదంటే ఆ పని పూర్తి చేసి రెంటులో తగ్గించుకోవచ్చు.
  • ఇంటిని ఉన్నఫలంగా ఖాళీ చేయించడం కుదరదు. రెంట్ ట్రైబ్యునల్ నుంచి లీగల్ ఆర్డర్ కచ్చితంగా తీసుకోవాలి. బలవంతంగా ఖాళీ చేయమనడం, నీళ్లు, విద్యుత్తు కట్ చేయడం, బెదిరించడం వంటివి చేయకూడదు.
  • అద్దెకు ఉండే వారు ఇంట్లోకి వచ్చే ముందే పోలీస్ వెరిఫఇకేషన్ తప్పనిసరిగా చేయించాలి.
  • సమస్యలు, ఖాళీ చేయించే వివాదాలు ఉంటే ట్రైబ్యునల్ 60 రోజుల్లోగా పరిష్కరించాలి.

కొత్త రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ 2025 అనేది అద్దెదారులు, ఇంటి యజమానుల డైలీ లైఫ్‌లో కీలక మార్పులు తీసుకొస్తుందని చెప్పవచ్చు. అలాగే ఇంటి యజమానులకు పారదర్శకత, అద్దెదారులకు భద్రతను కల్పించనుంది. భారత్‌లోని నోటి మాటతో చేసుకునే రెంటల్ అగ్రిమెంట్ల జమానాకు తెర పడినట్లయింది. మీరు అద్దెకు ఉండాలని అనుకుంటున్నా, భవిష్యత్తులో అద్దెకు ఉండబోతున్నా ఈ రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే ఇంటి యజమానులు సైతం ఈ రూల్స్ తెలుసుకుని ఇంట్లోకి కొత్త వాళ్లతో డిజిటల్ విధానంలో రెంటల్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.