గుడివాడలో నానికి ఓటమి తప్పదా?

ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎన్‌టి రామారావు గెలిచారు. కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (నాని) నాలుగు సార్లు వరుసగా గుడివాడ నుంచి గెలిచారు.


రెండు సార్లు టీడీపీ నుంచి రెండు సార్లు వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నాని మంత్రిగా రెండున్నర ఏళ్లు పనిచేశారు. గత ఎన్నికల్లో 18,969 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2024 ఎన్నికల్లో నాని గెలుపు ఓటములపై పందేలు కూడా జరుగుతున్నాయి. నాని గెలిచే అవకాశాలు చాలా తక్కువనే ప్రచారం సాగుతోంది.

ఓటు కొనుగోలుకు మూడువేలుఒక్కో ఓటు కొనుగోలుకు మూడు వేల వంతున కొడాలి నాని డబ్బలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 2,04,271య ఓట్లు ఉన్నాయి. ఇందులో లక్షన్నర ఓట్లు నాని కొనుగోలు చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నియోజకవర్గంలో గుడివాడ టౌన్, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో గుడివాడ టౌన్, గుడ్లవల్లేరు మినహాయిస్తే నందివాడ, గుడివాడ రూరల్‌ మండలాల్లో నానికి మెజారిటీ వస్తుందనే ప్రచారం సాగుతోంది. గుడ్లవల్లేరులో తెలుగుదేశం పార్టీకే మెజారిటీ వస్తుందని, గుడివాడ పట్టణంలో నానికి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని సమాచారం. నాని వర్గీయులు డబ్బలు పంచడంలో ముందున్నా గుడివాడ పట్టణంలోని 10,11,12 వార్డుల్లో నాని నుంచి డబ్బలు ఓటర్లకు అందలేదు. ఈ మూడు వార్డుల్లో పంచేందుకు డబ్బులు తీసుకున్న వారు స్వాహా చేశారు. చివరకు ఎన్నికల రోజు డబ్బులు ఇవ్వలేదని తేలింది. ఈ వార్డలకు చెందిన ముగ్గురు వ్యక్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నానికి కనిపిస్తే సమస్యలు వస్తాయని భావించిన వీరు పట్టణం వదిలి వెళ్లారు. వీరు తెలుగుదేశం పార్టీ వారి వద్ద కూడా డబ్బులు తీసుకని వైఎస్సార్‌సీపీ డబ్బులు పంచకుండా ఆగారా? నాని డబ్బులు స్వాహా చేసి మిన్నకున్నారా అనేది తేలాల్సి ఉంది. గుడివాడ పట్టణంలో వైఎస్సార్‌సీపీకి ఓట్లు తగ్గే అవకాశం ఉందని సమాచారం.తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము ముందుగా రెండున్నర వేలు ఓటుకు చొప్పున పంపిణీ చేశారు. నాని ఓటుకు మూడు వేలు ఇచ్చారని తెలియగానే మిగిలిన ఐదు వందలు కూడా ముందుగా డబ్బులు తీసుకున్న ఓటర్లకు చేర్చారు. రాము వైపు నుంచి ఓటర్లకు పంచిన ప్రతి రూపాయి ఓటరుకు చేరింది. నాని నుంచి పంపిణీ చేసిన డబ్బులు ఎక్కువ మంది ఓటర్లకు చేరలేదు. ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న నాని ఎందుకు బోల్తా పడ్డారనేదానిపై చర్చ సాగుతూనే ఉంది. రాముకు గుడివాడ పట్టణంలో మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎస్సీల ఓట్లు సుమారు 50వేలకు పైగానే ఉన్నాయి. ఇందులో మాలలు ఎక్కువగా ఉన్నారు. మాదిగలు కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో వేశారని చెప్పలేము. మొత్తం ఓట్లలో పోలయిన ఓట్లు 1,68,537 ఓట్లు. ఇవే కాకుండా 3066 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, 160 హోం ఓట్లు కాగా మొత్తం 1,71,763 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మీద 84.09 శాతం పోల్‌ కావడంతో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు.అభ్యర్థులు ఇద్దరూ అందుబాటులో ఉండేవారు కాదుకొడాలి నాని, వెనిగండ్ల రాములు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వారు కాదు. గెలవగానే నాని నియోజకవర్గంలో ఉండటం కంటే వేరే ప్రాంతాల్లో ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నెలకోసారి కూడా నియోజకవర్గంలో కనిపించని పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వారికి ఆర్థిక సాయం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. రాము పరిస్థితి కూడా ఇదే. ఈయన మొదటి సారిగా రాజకీయాల్లోకి దిగినా గుడివాడలో ఎప్పుడూ ఉండలేదు. విదేశాల్లో వ్యాపారాలు ఉన్నందున నెలకోసారి కూడా గుడివాడలో కనిపిస్తాడో లేదో ననే అనుమానాలు ఓటర్లలో ఉన్నాయి.వ్యక్తులను చూసా.. పార్టీలను చూసా…2024 ఎన్నికల్లో గుడివాడలో పోటీ చేసిన అభ్యర్థులను చూసి ఓటర్లు ఓట్లు వేశారా? పార్టీలను చూసి ఓట్లు వేశారా? అనే అంశంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ప్రధానంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డిని చూసి మాత్రమే ఓటర్లు ఓటు వేశారని పలువురు ఓటర్లు చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న రామును చూసి మాత్రమే ఓట్లు వేస్తున్నామని, టీడీపీని చూసి కాదని పలువురు ఓటర్లు చెప్పడం విశేషం.