హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రధానంగా ఐటి రంగం ఈ నగరంలో విస్తరించడమే కారణమని చెప్పవచ్చు. ఐటీరంగం ప్రారంభ దశలో హైటెక్ సిటీ కేంద్రంగా విస్తరించింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పశ్చిమ ప్రాంతంలోనే మనం రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడం పెద్ద మొత్తంలో ఇప్పుడు చూస్తున్నాం.
1990 దశకంలో హైటెక్ సిటీ మాదాపూర్ కేంద్రంగా ఐటి రంగం విస్తరించడం ప్రారంభించింది. అక్కడి నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానకరాంగుడా, కోకాపేట, కొండాపూర్ ఇలా ఐటీ పరిశ్రమ విస్తరించడం చూడవచ్చు. నేడు హైదరాబాదులో ప్రపంచ స్థాయి ఐటి కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలతో పాటు దేశీయ ఐటీ కంపెనీ టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో భవిష్యత్తులో మరే ఇతర ప్రాంతాలు గచ్చిబౌలి తరహాలో అభివృద్ధి చెందుతాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదానిపైన రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఈ మూడు ప్రాంతాల్లో అమెజాన్ డేటా సెంటర్ల నిర్మాణం
అయితే ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా డేటా సెంటర్ల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అమెజాన్ డేటా సెంటర్ల నిర్మాణం హైదరాబాదులోని మూడు ప్రాంతాలలో కేంద్రీకృతం చేసిందని చెప్పవచ్చు.
ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్
ఇందులో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో సుమారు 48 ఎకరాలలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతంలోనే భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అటు ఫార్మాసిటీకి సైతం దగ్గరలో ఉండటం గమనించవచ్చు. దీంతో ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పెద్ద ఎత్తున విస్తరిస్తోంది అని చెప్పవచ్చు.
ఇక రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం చందనవెల్లి లో కూడా డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్, అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా డేటా సెంటర్ నిర్మాణం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రావిరియాల ప్రాంతంలో కూడా ఫ్యాబ్ సిటీ సమీపంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది.
మరో రూ. 60 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధం..
దాదాపు 36 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ డేటా సెంటర్ల నిర్మాణం జరుగుతోంది భవిష్యత్తులో మరొక 60 వేల కోట్ల రూపాయలతో వీటి విస్తరణ సైతం చేపట్టేందుకు అమెజాన్ సంస్థ అంగీకరించింది. భవిష్యత్తులో ఈ ప్రాంతాల అభివృద్ధికి ఈ డేటా సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని పాఠకులకు సూచిస్తోంది.
































