AP:ఏపీ ఫైబర్ నెట్ లో అరాచకం..950 కోట్లు ఏమయ్యాయి?

www.mannamweb.com


AP:ఏపీ ఫైబర్ నెట్ లో అరాచకం..950 కోట్లు ఏమయ్యాయి?

Andhrapradesh New Govt Seized Ap Fibernet Office For Corrpution Allegation
జగన్ పాలనలో జరిగిన అక్రమాలను వెలికితీసే పనిలో ఉంది టీడీపీ. అప్పట్లో టీడీపీ పై అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైలుకు పంపడం తెలిసిందే. ఇప్పుడు జగన్ పాలనలో లూప్ హోల్స్ వెతుకుతోంది టీడీపీ. అప్పట్లో వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫైబర్ నెట్ సంస్థలో అక్రమాలు జరిగాయని టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇప్పుడు అధికార హోదాలో ఫైబర్ నెట్ సంస్థలో జరిగిన అక్రమాలు వెలికితీస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఫైబర్ నెట్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

అతి తక్కువ ధరలకే..

మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ధరలకే ఫోన్, ఇంటర్నెట్, ఓటీటీల ద్వారా కొత్త సినిమాలు ఇంట్లోనే వీక్షించే విధంగా సేవలందించేందుకు ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) ప్రవేశపెడుతున్నామని ఎంతో ఆర్భాటంగా ఈ పథకాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన ప్యాకేజీలతో సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం తీసుకొచ్చిన ఈ పథకం కింద వసూలు చేసిన నిధులన్నీ దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో తెలుగుదేశం ప్రభుత్వం అప్రమత్తమయింది. రూ.950 కోట్ల అక్రమ వసూళ్ళకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆ సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు. సంస్థలో పనిచేసే ఉద్యోగుల వివరాలు సేకరించారు. వాళ్లందరినీ ఇళ్లకు పంపించేశారు. సిబ్బందితో సహా కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించలేదు. పూర్తిగా పోలీసుల భద్రతతో , నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఉద్యోగులంతా రికమెండేషన్ అభ్యర్థులే

దాదాపు 1500 మంది దాకా ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. వాళ్లకు జీతాలు కూడా లక్షల్లో ఇచ్చారు. వీళ్లందరికీ రాజకీయ నేతల సపోర్టు కూడా ఉంది. వాళ్ల రికమెండేషన్ తో లక్షల శాలరీని పొందుతూ ఎంజాయ్ చేశారు ఉద్యోగులు. దాదాపు 10 లక్షల కనెక్షన్లు ఉండేవి మొదట్లో. క్రమంగా నాలుగు లక్షల యాభై వేలకు పడిపోయాయి కనెక్షన్లు. తక్కువ రేటుకే ఇంటర్నెట్, సినిమాలు, ఫోన్ సదుపాయం ఉండటంతో ఆకర్షితులయ్యారు కస్టమర్లు. అయితే ఆ తర్వాత వారు ఊదరగొట్టినట్లుగా సేవలను అందించలేకపోవడంతో అనూహ్యంగా కనెక్షన్లు తగ్గిపోవడం ప్రారంభం అయింది. ఇక ఫైబర్ నెట్ సంస్థకు సంబంధించి సెట్ టాప్ బాక్స్ లు, విద్యుత్ పరికరాల కొనుగోళ్లలోనూ సిబ్బంది చేతివాటం ఉన్నట్లు చెబుతున్నారు.

సంస్థ ఎండీ పాత్ర

ప్రస్తుతం పోలీసు వలయంలో ఫైబర్ నెట్ సంస్థ ఉంది. సంస్థ ఎండీ పాత్ర ఏమిటి? ఆయన వెనక ఉన్న రాజకీయ నేతలు ఎవరు? ఇందులో వాళ్ల వాటా ఎంత? తదితర అంశాలపై త్వరలో విచారణ జరుపనున్నారు. ఆలస్యం అయితే కీలక సాక్ష్యాలు మాయం అవుతాయని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా ఫైబర్ నెట్ అక్రమాలపై దర్యాప్తు ఆదేశాలు వస్తాయని ఆశిస్తున్నారు.సంస్థ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది. దర్యాప్తులో నిజమేనని తేలితే..దాని పర్యవసనాలు తీవ్రంగానే ఉంటాయని భావిస్తున్నారు. అల్పాదాయ వర్గాలపై ప్రేమ కురిపిస్తున్నామని చెబుతూ వారి నుంచి సంవత్సర చందాలను కట్టించుకుని ఆ డబ్బులతో జల్సాలు చేసిన జగన్ సర్కార్ కు ఇక చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు.