ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోస్.. అక్కినేని నాగార్జున ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం ఫీచర్ సిటీ లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్లోబల్ సమ్మిట్ ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభం అయింది.


దీనికి ముఖ్య అతిధిగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ చాలా అద్భుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’కి తమ అన్నపూర్ణ స్టూడియోస్‌ను కూడా తీసుకురాబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు.

అలాగే, ఫ్యూచర్ సిటీ లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఒక ప్రత్యేకమైన ‘ఫిలిం హబ్ ను ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రణాళికలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కూడా చోటు కల్పించడం పట్ల హీరో నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ సినిమా షూటింగ్‌లకు, నిర్మాణాలకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.