మరో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. స్పాట్‌లో 171 మంది – గజగజ వణుకుతూ

హ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే.. ఇప్పుడు మరొక విమానం ప్రమాదానికి గురైంది. మంగళవారం ఢిల్లీ నుండి పాట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-407 ఒక్కసారిగా కుదుపులకు గురైంది.


దీంతో విమానంలో ఉన్న 171 మంది ప్రయాణికులు భయంతో గజగజ వణికిపోయారు. ఈ కుదుపుల కారణంగా బ్యాగులు కింద పడిపోయాయి.

patna air india flight ai407

ఆ సమయంలో చాలా మంది ప్రయాణీకులు భోజనం చేస్తున్నారు. అప్పుడే విమానం కుదుపులకు గురి కావడంతో వారి ఆహారం, డ్రింక్స్ కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది ప్రయాణీకులలో మరింత భయాందోళనలను పెంచింది. ఏదో అవాంఛనీయ సంఘటన జరుగుతుందని భావించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. దీంతో విమానం లోపల ఉద్రిక్తంగా మారింది.

చిన్నా, పెద్దా, ముసలి, ముతక అంతా పెద్ద ప్రమాదం జరగబోతుందని భావించి అందరూ తమ సీట్లను గట్టిగా పట్టుకున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఓపికగా వ్యవహరించిన పైలట్స్.. విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. ఈ సవాలుతో కూడిన పరిస్థితిలో పైలట్ తన అవగాహన, అనుభవాన్ని ప్రదర్శించి 171 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. పాట్నా విమానాశ్రయంలో సేఫ్ట్గా ల్యాండ్ చేశారు.

దీంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పైలట్, సిబ్బందిని ప్రశంసించారు. అదృవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదు. మరోవైపు ఎయిర్ ఇండియా ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.