ఏపీకి మరో అమృత్ భారత్ రైలు..! రేపట్నుంచే-హాల్ట్ లు ఇవే

ఏపీలో ప్రయాణికులకు రైల్వే మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖ ఇప్పుడు అమృత్ భారత్ రైలును కూడా నడిపేందుకు సిద్దమైంది.

అదీ రేపటి నుంచే ఈ కొత్త అమృత్ భారత్ రైలు అందుబాటులోకి రాబోతోంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించబోతోంది, పూర్తి షెడ్యూల్, హాల్ట్ లు ఓసారి చూద్దాం..


తమిళనాడులోని తాంబరం నుంచి పశ్చిమబెంగాల్ లోని సంత్రగచ్చి మధ్య ఈ కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది. జనవరి 23 నుండి ఇక ప్రతీ శుక్రవారం ఈ రైలు నడపనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తాంబరం నుండి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.15 గంటలకు ఈ రైలు సంత్రగచ్చిచేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శనివారం రాత్రి 11.55 గంటలకు సంత్రగచ్చి నుండి బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 9.15 గంటలకు తాంబరం చేరుకుంటుంది.

తాంబరం నుంచి ప్రారంభమయ్యే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 16107 చెన్నై ఎగ్మోర్ మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి సూళ్లూరుపేటలో సాయంత్రం 5.43కు, నెల్లూరులో 6.48కి, ఒంగోలులో 8.48కి, చీరాలలో 9.43కి, తెనాలిలో10.28కి, విజయవాడలో 11.10కి, ఏలూరులో అర్ధరాత్రి 12.18కి, రాజమండ్రిలో తెల్లవారు 1.38కి, సామర్లకోటలో 2.28కి, అనకాపల్లిలో 4.03కి, దువ్వాడలో 4.50కి, పెందుర్తిలో 5.33కి, కొత్త వలసలో 5.43కి, విజయనగరంలో 6.10కి, శ్రీకాకుళం రోడ్ లో 7.33కి, పలాసలో 9.03కి ఆగుతుంది.

అలాగే తిరుగు ప్రయాణంలో అమృత్ భారత్ రైలు నంబర్ 16708 పలాసలో మధ్యాహ్నం 12.43కి, శ్రీకాకుళం రోడ్ 1.33కి, విజయనగరం 2.30కి, కొత్తవలస 3.05కి, పెందుర్తి 2.15కి, దువ్వాడ 4.38కి, అనకాపల్లి 4.58కి, సామర్లకోట 6.23కి, రాజమండ్రి సాయంత్రం 7.05కి, ఏలూరు రాత్రి 8.05కి, విజయవాడ 10.45కి, తెనాలి 11.23కి, చీరాల అర్ధరాత్రి 12.23కి, ఒంగోలు తెల్లవారు 1.33కి, నెల్లూరు 3.58కి, సూళ్లూరుపేట 6.08కి చేరుకుంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.