‘జైలర్’ లాంటి ఇండస్ట్రీ హిట్‌తో డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఇప్పుడు సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోయాడు. ఆ ఒక్క సినిమాలో రజినీకాంత్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ లాంటి స్టార్లను చూపించి, మల్టీ స్టారర్ కాన్సెప్ట్‌నే ఆయన నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాడు.
ఇప్పుడు అతను ‘జైలర్ 2’ పనుల్లో బిజీగా ఉన్నాడు. కానీ, ప్రస్తుతం నెల్సన్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించే కొన్ని గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం, కోలీవుడ్ లో పవర్ఫుల్ కాంబోను నెల్సన్ సెట్ చేస్తున్నాడని టాక్ వచ్చింది. కోలీవుడ్ లెజెండ్స్ రజినీకాంత్, కమల్ హాసన్‌ల కాంబినేషన్ కోసం కథ సిద్ధం చేశారని చాలా వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ వినడానికే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చాయి. ఇది నిజమైతే, ఇండియన్ సినిమాలో ఇదే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుంది.
అయితే, ఇప్పుడు ఆ టాక్‌ను మించిపోయేలా మరో క్రేజీ గాసిప్ సౌత్ ఇండియా మొత్తం చక్కర్లు కొడుతోంది. నెల్సన్ అంబిషన్ కేవలం కోలీవుడ్‌కే పరిమితం కాలేదని, ఆయన ఫోకస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ మీద పడిందని అంటున్నారు. ‘RRR’ లాంటి హిస్టారిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను మళ్లీ కలిపి ఒకే తెరపైకి తెచ్చేందుకు నెల్సన్ ప్రయత్నిస్తున్నాడట.
నెల్సన్ ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఒక స్టోరీ లైన్ నెరేట్ చేశాడని, వాళ్లు కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారని తమిళ సర్కిల్స్‌లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇది వినడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా, అసలు నమ్మశక్యంగా లేదు. ఒకే డైరెక్టర్, ఒకే టైమ్‌లో రెండు అల్టిమేట్ మల్టీ స్టారర్లను ఎలా ప్లాన్ చేస్తాడు, అసలు ఇది సాధ్యమేనా? డౌట్ రాకుండా ఉండదు.
‘జైలర్ 2’ ఇంకా పూర్తికాలేదు, అప్పుడే ఈ రెండు ప్రాజెక్టులనూ లైన్‌లో పెట్టడం అనేది నమ్మకంగా అనిపించడం లేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. బహుశా నెల్సన్ ఈ ఇద్దరు హీరోలను కలిసి స్టోరీ లైన్ చెప్పి ఉండొచ్చు. కానీ, అది ప్రాజెక్ట్‌గా మారడానికి చాలా టైమ్ పడుతుంది. ఫుల్ స్క్రిప్టు సిద్ధమైతే కానీ ఎన్టీఆర్, చరణ్ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే రాజమౌళిపై ఉన్నంత నమ్మకం మరే దర్శకులను మన హీరోలను అంత ఈజీగా నమ్మరు అనే టాక్ కూడా వస్తోంది. ఒకవేళ ఈ గాసిప్‌లో కొంచెమైనా నిజం ఉంటే, మాత్రం నెల్సన్ దశ తిరిగినట్లే.
































