ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దాదాపు 20 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానున్నట్లు సమాచారం.
ఈ మేరకు ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్(లిఫ్ట్) పాలసీ 2024-29కి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులపై చర్చలు జరగనున్నాయి. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రూ.15 వేలు ఆర్థిక సాయం ఇచ్చే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
అలాగే.. కొత్త పర్యాటక విధానం కారవాన్ పర్యాటకానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమృత్ పథకం 2.0 పనులకు, అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పజ్ వెహికల్ ఏర్పాటుకు, అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపులు, కుష్టు వ్యాధి పదం తొలగించే చట్టసవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. వీటితో పాటు విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలతో పాటు కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
































