AP News:’ఈ ఏడాదే ఆ రెండు పథకాలు ప్రారంభిస్తాం’.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ(శుక్రవారం) టీడీపీ పొలిట్ బ్యూరో(TDP Polit Buro) భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో తల్లికి వందనం( విద్యార్థికి రూ.15000), అన్నదాత సుఖీభవ(రైతుకు రూ.20,000) పథకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాల(Government Schemes) అమలుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏడాదే(2025) తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో ప్రకటించారు.

ఈ క్రమంలో అన్నదాత-సుఖీభవ పథకాన్ని(Annadata-Sukhibhava scheme) మూడు విడతల్లో చెల్లిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఆదాయం(Income) పెంచే మార్గాలు వెతుకుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి నీళ్లు(Godavari Water) రాయలసీమ(Rayalaseema)కు తరలించేలా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)ను ప్రభుత్వం, కాంట్రాక్టర్లు భరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో సూపర్ సిక్స్ పథకాల పై వస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.