పెద్దిరెడ్డికి చెక్ పెడుతున్న చంద్రబాబు, ఏపీఎండీసీ స్కామ్, విచారణకు కమిటి ??

ఆంధ్రప్రదేశ్ లో కొలువుతీరిన ఎన్డీఏ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల బయటకు లాగాలని ఫోకస్ పెడుతోందని వెలుగు చూసింది. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని అనేక ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని టార్గెట్ చెయ్యాలని, ఆయన లోసుగులు బయట పెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచిస్తున్నారని తెలిసింది..


గత వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖా మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు లేఖలు ఇవ్వడంతో వందల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇదే సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎక్కువ ప్రధాన్యత ఇవ్వకుండా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సిఫార్సుతో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెద్దపీట వేశారని ఆరోపణలు ఉన్నాయి. 2019 వరకు ఏపీఎండీసీ సంస్థలో కేవలం 50 మంది మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులు ఉండేవారని, పెద్దిరెడ్డి చేతికి గనుల శాఖ వచ్చిన తరువాత ఆ సంస్థలో సుమారు 400 మందికిపైగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు చేరారని ఆ సంస్థలో పని చేస్తున్న కొందరు ఆరోపించారు.

కేవలం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిఫార్సు లేఖలు తీసుకు వచ్చి ఏపీఎండీసీ సంస్థలో ఉద్యోగాల్లో చేరారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అర్హతలు లేకున్నా వందల మందికి ఆ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారని, చాలా మందికి రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు జీతం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఎపీఎండీసీలో తొలుత ఎండీగా పని చేసిన మధుసూదన్ రెడ్డి, తరువాత వచ్చిన ఇన్ చార్జ్ మంత్రి వెంకటరెడ్డి నిబంధనలకు విరుద్దంగా వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

కార్పోరేట్ సంస్థల్లో పని చేసిన వైసీపీ సానుభూతిపరులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ కోసం పని చేసిన ఇంటర్ పాస్ అయిన వాళ్లకు ఏపీఎండీసీలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చారని, మిగిలిన వారు కడప జిల్లాకు చెందిన వారని ఆరోపణలు ఉన్నాయి. ఏపీఎండీసీలో జరిగిన అవకతవల గురించి విచారణ జరిపిస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని, మింగేసిన డబ్బులు వారి నుంచి కక్కించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిసింది.