గురుకులాలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.


ఈ విద్యా సంవత్సరంలో గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థినీ, విద్యార్థులు గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా లక్షెట్టిపేట (బాలికల) గురుకుల విద్యాలయంలో దరఖాస్తులు సమమర్పించాలని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు హాల్ టికెట్, ర్యాంకు ధ్రువీకరణ పత్రాల నకలు ప్రతులు జత పరచాలని సూచించారు. లక్షెట్టిపేట, చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి (బాలికలు), బెల్లంపల్లి, కాసిపేట, కోటపల్లి, మంచిర్యాల, జైపూర్ (బాలుర) సాంఘిక సంక్షేమ గురుకులాలలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ నెల 18న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేసి, భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.

బాలికల గురుకులాలలోని 6వ తరగతిలో ఎస్సి 6, ఎస్టి 2, బీసీ 3, జనరల్ 3, మైనారిటీ 2 సీట్లు ఉన్నాయన్నారు. 7వ తరగతిలో బీ సి 5 సీట్లు, 8 వ తరగతిలో ఎస్సి 4, ఎస్టి 1, బీసీ 10, జనరల్ 6, మైనారిటీ 5, 9వ తరగతి లో ఎస్ సి 3, ఎస్టి 4, బీసీ 4, జనరల్ 5, మైనారిటీ 3 సీట్లు ఉన్నాయని తెలిపారు. బాలుర గురుకులాలలో 5వ తరగతిలో ఎస్టి 3, జనరల్ 3, మైనారిటీ 2 సీట్లు, 6వ తరగతిలో ఎస్సి 9, ఎస్టి 5, జనరల్ 1, మైనారిటీ 6 సీట్లు, 7వ తరగతిలో ఎస్సి 5 సీట్లు, 8వ తరగతిలో ఎస్సి 8, బీసీ 8, జనరల్ 6, మైనారిటీ 8, 9వ తరగతి లో ఎస్సి 11, బీసీ 4, ఓసీ 7, మైనారిటీ 5 సీట్లు ఉన్నాయని తెలిపారు. సకాలంలో దరఖాస్తులను అందించాలని తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.