ప్రతిరోజూ నానబెట్టిన వేరుశనగ గింజలు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

నానబెట్టిన నల్ల శనగలు ఆరోగ్యానికి అమృతం లాంటిది. మీరు ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన శనగలు తింటే బోలెడన్నీ ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు వంటి అనేక ఇతర పోషకాలు శరీరంలోని అనేక సమస్యలను తొలగించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. రోజూ నానబెట్టిన శనగలు తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఫైబర్ అధికంగా ఉండే నల్ల శనగలు నానబెట్టి తినటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ప్రేగులు, కడుపులో పేరుకుపోయిన విష వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం,అ జీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ప్రతి ఉదయం నానబెట్టిన శనగలు తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


నల్ల శనగలలో యాంటీఆక్సిడెంట్లు ఆంథోసైనిన్‌లు, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి.. ఈ లక్షణాలు రక్త నాళాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనితో పాటు, ఇందులో మెగ్నీషియం, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇవి అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

ప్రతిరోజు ఉదయం నానబెట్టిన శనగలు తింటే, ఎక్కువసేపు ఆకలి వేయదు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి, నానబెట్టిన శనగలు తినటం వల్ల చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో మీరు అతిగా తినడం కూడా ఉంటారు.

నానబెట్టిన శనగలు తింటే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఈ మూలకం కంటి కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. దీని రోజువారీ వినియోగం కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.

ఒక గ్రాము శనగలలో ఐరన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇనుము ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనతను తొలగిస్తుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.