ఇప్పుడు రైస్ కుక్కర్ లో వండడం అలవాటు అయ్యింది. అలాంటి రైస్ ను ఎంతోమంది మెత్తగా చాలా బాగుంటుంది అని ప్రెషర్ కుక్కర్ లో వండుతారు. ప్రెజర్ కుక్కర్ లో వండినప్పుడు..
రైస్ లోని పోషకాలు బయటకుపోయే అవకాశం ఉండదు. దీంతో, పోషకాలు అలానే ఉండటం వల్ల.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ప్రెజర్ కుక్కర్ లో అన్నం చెమ్మలేకుండా, రుచిగా ఉంటుంది. అయితే, ప్రెషర్ కుక్కర్ లో వండిన అన్నం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా.. కొందరిలో ఈ సందేహాం ఉంది. దీని పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలెక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో అన్నం వండు తున్నారు. ఈజీగా ఉండడంతో చాలా మంది ఈ పద్ధతినే ఎక్కువగా అనుసరిస్తున్నారు. కుక్కర్ సహాయంతో అన్నం, కూరగాయలు, పప్పులు మొదలైనవన్నీ నిమిషాల మీద ఉడికిపోతాయి. పైగా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ప్రెజర్ కుక్కర్ లో ఆహారం ఉడుకుతున్నప్పుడు ఆవిరి బయటకు వెళ్లదు. ఈ ఆవిరి కాస్తా ఉష్టోగ్రతగా రూపాంతరం చెంది ఆహారం తొందరగా ఉడకడానికి సహాయపడుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆహారం ఉడుకుతుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచి ది కాదని కొందరు చెబుతారు. కాగా, ఎక్కువ ఉష్టోగ్రత ఉన్నా చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇది ఆరోగ్యం అని మరికొందరు అంటారు. ఇలా కుక్కర్ వంట గురించి విభిన్న వాదనలు ఉన్నాయి. అయితే కుక్కర్లో వండే ఆహారాన్ని బట్టి దాని ఫలితాలుంటాయని అంటున్నారు.
అయితే, పిండిపదార్థాలను ఇలా ప్రెజర్ కుక్కర్లో ఉడికించినప్పుడు యాక్రిలామైడ్ అనే రసా యనం ఏర్పడుతుందనే వాదన ఉంది. ప్రతిరోజూ కుక్కర్లో వండిన అన్నాన్ని తింటే యాక్రిలామైడ్ కారణంగా నాడీ సంబంధ జబ్బులు చాలా తొందరగా చుట్టుముడతాయనే అభిప్రాయం ఉంది. కాగా, ఆహారనిపుణులు మాత్రం వంట చేయడానికి కేవలం కుక్కర్ వినియోగం మీద ఆధార పడ కుండా ఇతర పద్దతుల్లో వంట చేయడానికి మెల్లిగా అలవాటు పడాలి. తినే ఆహారం రుచిగా ఉందా లేదా అన్నదే కాకుండా..ఎలా వండారనేది కూడా అందరూ తెలుసుకోవలసిన ముఖ్య విషయంగా సూచిస్తున్నారు.
ఇక.. ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనేది కొందరి వాదన. అయితే.. ప్రెషర్ కుక్కర్ లో ఉడకడంవల్ల.. బియ్యం, నీళ్లలోని హానికర బ్యాక్టీ రియా నాశనమైపోయి.. అన్నం రుచిగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు కుక్కర్లో వండిన అన్నంలో పిండి పదార్థం తొలగిపోతుందట. అందువల్ల ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుందని.. ఫలితంగా ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.






























