ఆరోగ్యశ్రీ పథకానికి గుడ్ బై చెప్పనున్నారా.. ప్రజలకు భారీ షాక్ తప్పదా?

రోగ్యశ్రీ పథకం రూపు రేఖలు మారబోతున్నాయా? అనే ప్రశ్నకు ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆరోగ్యశ్రీ కార్డును కలిగి ఉన్నవాళ్లు కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకునే అవకాశం అయితే ఉందనే సంగతి తెలిసిందే.
ఈ కార్డును కలిగి ఉన్నవాళ్లు డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతి ఖర్చును ప్రభుత్వం భరిస్తుందనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఈ పథకం మాత్రం అమలవుతూ వస్తోంది.


పేర్లు మారినా పథకం మాత్రం కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఉచిత వైద్యం అందేలా ఈ పథకం కొనసాగుతోంది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి హెల్త్ పాలసీ వర్తించేలా ఈ పథకం అమలు కానుందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది తెలుస్తోంది.

2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో హైబ్రిడ్ విధానంను ఫాలో అయ్యి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 3,257 చికిత్సలను ఈ విధానం ద్వారా ఫ్రీగా అందించనున్నారు. ప్రీ-ఆథరైజేషన్ మేనేజ్‌మెంట్ ద్వారా కేవలం 6 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే విధానం సైతం తెలుస్తోంది. రూ.2.5 లక్షల లోపు ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు భరించనుండగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వైద్య ఖర్చులు భరించనుంది.

ఈ కొత్త స్కీమ్ 2.5 లక్షల పేద కుటుంబాలతో పాటు 20 లక్షల ఇతర కుటుంబాలకు సైతం ప్రయోజనం చేకూర్చనుంది. త్వరలో ఈ పథకానికి సంబంధించిన పూర్తీ వివరాలు వెల్లడి కానున్నాయి. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలుపై ఏపీ ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..

ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.