పెట్రోల్ బంకుల్లో మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా మంది సాధారణ ప్రజలకు తెలియని, బయటకు రాని ఎన్నో మోసాలు ఉన్నాయి. పెట్రోల్ బంక్‌కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ సున్నా (0) కనబడుతుంది.
మనల్ని చూడమంటారు. అది మనకు కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అయితే వినియోగదారులు గమనించాల్సింది మరొకటి ఉంది (checking zero petrol pump).
మీటర్‌పై సున్నాను చూడటం మాత్రమే సరిపోదు. అసలు మోసం డెన్సిటీ మీటర్లో జరుగుతుంది. చాలా మంది కస్టమర్లు ఈ అంశాన్ని పట్టించుకోరు. డెన్సిటీ మీటర్ అనేది పెట్రోల్ నాణ్యతను సూచిస్తుంది. వాహనంలోకి వెళుతున్న పెట్రోల్ లేదా డీజిల్ కల్తీ అయిందో, లేదో వెల్లడిస్తుంది. పెట్రోల్ పంపింగ్ మెషిన్లు ధర, పరిమాణం, డెన్సిటీ డేటాను ప్రదర్శించే స్క్రీన్లను కలిగి ఉంటాయి. అయితే చాలా మంది కస్టమర్లు సున్నాను మాత్రమే తనిఖీ చేసి ఊరుకుంటారు (petrol pump density meter).
పెట్రోల్ డెన్సిటీకి సంబంధించి ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది (fuel cheating tricks). పెట్రోల్ క్యూబిక్ మీటర్‌కు 730 నుంచి 800 కిలోల సాంద్రత కలిగి ఉండాలి. డీజిల్ క్యూబిక్ మీటర్‌కు 830 నుంచి 900 కిలోల సాంద్రత కలిగి ఉండాలి. ఈ పరిధిలో లేకపోతే ఆ ఇంధనం కల్తీ అయినట్టు భావించాలి. ఇలా జరగడం వల్ల మీ జేబుకు చిల్లు పడడమే కాదు.. వాహనం ఇంజిన్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వినియోగదారులు డెన్సిటీ మీటర్‌ను కూడా తప్పకుండా పరిశీలించాలి అని నిపుణులు సూచిస్తున్నారు.



































