పెట్రోల్ సేవ్ చేద్దామని సిగ్నల్స్ దగ్గర బండి ఆపేస్తున్నారా..? ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు

పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. దీంతో వీటిని భరించలేక చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక పెట్రోల్, డీజిల్‌ వెహికల్స్ వాడేవారు ఖర్చును తగ్గించుకోడానికి అనేక ఉపాయాలు పాటిస్తున్నారు.


మెట్రో సిటీలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో సిగ్నల్స్ వద్ద వేచి ఉండాల్సి వచ్చినప్పుడు పెట్రోల్ ఆదా చేసుకోవడానికి చాలామందికి ఇంజిన్ ఆపేసే అలవాటు ఉంటుంది. ఇక మరికొంతమంది బండి న్యూట్రల్‌లో పెట్టి ఇంజిన్ ఆన్ చేసి ఉంచుతారు. ఇంజిన్ ఆపేసి మళ్లీ ఆన్ చేయడం వల్ల పెట్రోల్ అదనంగా ఖర్చు అవుతుందని మరికొంతమంది భావిస్తున్నారు. అయితతే ఇంజిన్ ఆపేయడం వల్ల పెట్రోల్ లేదా డిజిల్ ఖర్చు తగ్గుతుందా..? లేదా? అనే అనుమానం చాలామంది బైక్, కార్ల వినియోగదారులకు ఉంటుంది. దీని గురించి వివరాలు తెలుసుకుందాం.

బండి ఐడ్లింగ్‌లో(బండి కదలకుండా ఇంజిన్ రన్ అవుతుంది) ఉన్నప్పుడు ఇంజిన్ ఇంధనాన్ని మండిస్తూనే ఉంటుంది. దీని వల్ల బండి కదలకపోయినా ఇంజిన్ రన్ అవుతూ ఉండటం వల్ల ఇంధనం ఖర్చు అవుతూ ఉంటుంది. బైక్‌లు అయితే తక్కువ ఇంధనాన్ని మండిస్తాయి. ఈ సమయంలో ఇంజిన్ పరిమాణం, లోడ్ ఆధారంగా ఇంధన వినియోగం మారుతుంది. ఇటీవల వచ్చే కొత్త వాహనాలు ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌లతో వస్తున్నాయి. ఇంధన వినియోగం తగ్గించడం, ఇంజిన్ ఆపేయడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

ఇంజిన్ తిరిగి స్టార్ట్ చేస్తే..

సిగ్నల్స్ దగ్గర ఇంజిన్ ఆపేసి తిరిగి స్టార్ట్ చేయడం వల్ల ఇంధనం ఖర్చవుతుంది. కానీ 30 నుంచి 60 సెకన్ల కంటే ఎక్కువసేపు బండి ఐడ్లింగ్‌లో ఉన్నప్పుడు ఖర్చయ్యే ఇంధనం కంటే ఇంజిన్ తిరిగి స్టార్ట్ చేయడం వల్ల వినియోగించే ఇంధనం చాలా తక్కువ. దీని వల్ల రెడ్ సిగ్నల్ టైమ్ ఒక నిమిషం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇంజిన్ ఆపేయడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది. బైక్‌లు అయితే ఐడ్లింగ్ సమయంలో తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. అందువల్ల సిగ్నల్ సమయం తక్కువ ఉన్నప్పుడు ఇంజిన్ ఆప్ చేయడం ద్వారా ఆదా అయ్యే ఇంధనం తక్కువగా ఉంటుంది.

కార్ల విషయానికొస్తే..

పెట్రోల్ కార్లు ఐడ్లింగ్ సమయంలో ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. అందువల్ల రెడ్ సిగ్నల్స్ ఎక్కువసేపు ఉన్నప్పుడు ఇంజిన్ ఆఫ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇక డీజిల్ వాహనాలు పనిలేకుండా ఉన్న సమయంలో ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తాయి. అంతేకాకుండా ఇంజిన్ రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాటరీ, మోటార్లపై ఒత్తిడి పడుతుంది. రెడ్ సిగ్నల్స్ ఎక్కువసేపు ఉంటే తప్పితే డిజిల్ కార్లు వాడేవారు ఇంజిన్ ఆఫ్ చేయకపోవడమే మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.