ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఆ విషయాల్లో జాగ్రత్తలు మస్ట్..!

www.mannamweb.com


ఆరోగ్య బీమా పాలసీ కోసం మీరు చెల్లించే మొత్తం ఎలా చెల్లించాలో? నిర్దారించుకోవాలి. సాధారణంగా నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లింపులు చేయడం ఉత్తమం.

అలాగే బీమా మొత్తంపై కూడా అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని పాలసీల ప్రకారం అనారోగ్యం వచ్చినప్పుడు సొమ్ము చెల్లించి సంబంధిత బిల్లులతో క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కొన్ని బీమా సంస్థలు నగదు రహిత సేవలను కూడా అందిస్తున్నాయి. కాబట్టి అలాంటి బీమాను ఎంచుకోవడం ఉత్తమం.

నగదు రహిత చికిత్స పొందడానికి బీమా కంపెనీతో టై-అప్ ఉన్న ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే బీమా పాలసీని కొనుగోలు చేయడానికి ముందు మీకు ఇప్పటికే ఉన్న అనారోగ్యం గురించి పేర్కొనాలి. పాలసీలు ఈ షరతుల కవరేజీ కోసం వెయిటింగ్ పీరియడ్‌లను కలిగి ఉంటాయి.

ఆరోగ్య బీమా తీసుకున్నా పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే పాలసీ బోనస్‌ను అందిస్తాయి. ఇది ప్రీమియంపై తగ్గింపు రూపంలో లేదా బీమా మొత్తంలో పెరుగుదల రూపంలో ఉండవచ్చు.

అయితే వేయిటింగ్ పిరియడ్‌లో సంబంధిత అనారోగ్యంతో చికిత్స చేయించుకుంటే ఎలాంటి ప్రయోజనాలూ వర్తించవు. కానీ అనుకోని ఇతర సమస్యలకు చికిత్స చేయించుకుంటే బీమా వర్తిస్తుంది. ఈ మినహాయింపులను అర్థం చేసుకోవడానికి పాలసీ డాక్యుమెంట్‌ను చదవడం చాలా ముఖ్యం.