LAP, రెసిడెన్షియల్, కమర్షియల్ లేదా ఇండస్ట్రియల్ ప్రాపర్టీని తనఖా పెట్టి, రుణానికి పూచీకత్తుగా ఉపయోగిస్తారు. దీని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించాలని లేదా మీ ఇంటిని పునరుద్ధరించేందుకు ప్లాన్ చేసుకోవచ్చు, LAP అనేది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్.
ప్రాపర్టీ లోన్, ఇతర రుణాల కంటే ఎలా భిన్నమైనది?
వడ్డీ రేటు
LAP అనేది సెక్యూర్డ్ లోన్ , ఇది ఒక ప్రాపర్టీ ద్వారా ఇచ్చేటువంటి రుణం. పర్సనల్ లోన్స్ వంటి అన్‌సెక్యూర్డ్ లోన్‌ల కంటే తక్కువ వడ్డీ రేట్లకు లోన్ ఇస్తుంది.
ఫ్లెక్సిబిలిటీ
హోమ్ లోన్ లేదా కారు లోన్ వలె కాకుండా ప్రాపర్టీపై లభించిన లోన్‌ను బిజినెస్, ఎడ్యుకేషన్, వెడ్డింగ్ లేదా ఇతర అప్పులు తీర్చేందుకు ఎలా ఎన్నో అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.
లోన్ అమౌంట్
LAPలో లోన్ అమౌంట్ అనేది ఆస్తి విలువ, ఆదాయం ఆధారంగా ఉంటుంది. ఇతర లోన్స్, లోన అమౌంట్ అనేది లోన్ తీసుకునే అవసరాన్ని, ఇతర నిబంధనలను బట్టి ఉంటుంది.లోన్ తీసుకునే వ్యక్తి ఎలిజిబిలిటీ ఆధారంగా LAP అనేక లక్షల నుండి అనేక కోట్ల వరకు లోన్ అమౌంట్ ఉంటుంది. దీనితో పాటు ప్రాపర్టీపై ఇచ్చే లోన్స్‌కు రుణదాతలకు ఎలాంటి రిస్క్ ఉండదు.
ప్రాపర్టీ లోన్ తీసుకోవాలంటే కావాల్సిన అర్హలు ఇవే!
సాధారణంగా రుణదాతలు ప్రాపర్టీ లోన్‌కు దరఖాస్తు చేసుకునే వ్యక్తి ప్రొఫైల్ ఆధారంగా లోన్ జారీ చేస్తారు. ఆదాయం, ప్రాపర్టీ రిలేటెడ్ అంశాలను బట్టి రుణాన్ని జారీచేస్తారు.
జీతం పొందే వ్యక్తులు, వైద్యులు వంటి సెల్ఫ్-ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్స్ వంటి స్వయం ఉపాధి పొందే వ్యక్తులు , భాగస్వామ్య సంస్థలు, LLPలు, అందరూ ప్రాపర్టీ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారికి స్థిరమైన ఆదాయం , లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని నిర్దారించాల్సి ఉంటుంది. దీనితో పాటు ప్రాపర్టీ ఉన్నటువంటి లొకేషన్, ఓనర్‌షిప్ క్లారిటీ, ప్రాపర్టీ కండీషన్ వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని లోన్స్ జారీ చేస్తారు. ప్రాపర్టీపై లోన్ విషయంలో లోన్ అమౌంట్, వడ్డీ రేటు , కాలపరిమితిని వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నెలవారీ EMIలను అంచనా వేయవచ్చు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కొన్ని EMI కాలిక్యులేటర్లు ఆధారంగా ఈఎమ్ఐ లెక్కించవచ్చు.



































