ఉద్యోగం సెర్చ్ చేసి విసిగిపోయారా.? తిరుగులేని వ్యాపారం

క్లాతింగ్ బిజినెస్.. మంచి లాభం.. పెట్టుబడి తక్కువ.! ఉద్యోగం గురించి సెర్చ్ చేసి.. చేసి.. విసిగిపోయినవారు ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.


పెట్టిన పెట్టుబడికి.. తగ్గట్టుగా వృద్ది రావడమే కాదు.. తగిన లాభాలు కూడా ఆర్జించవచ్చు. సాధారణంగా ఓ బట్టల షాప్ ప్రారంభించడానికి మొదట రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఇక క్వాలిటీ డ్రెస్సులు తక్కువ ధరకు కావాలంటే బెంగుళూరులోని చిక్కపేట్, ఢిల్లీలోని గాంధీనగర్ లాంటి హోల్‌సేల్ మార్కెట్లకు వెళ్ళాల్సిందే.

అటు బిజినెస్ అంచనా గురించి చూసుకుంటే.. నెలకు సుమారు 300 మంది కస్టమర్లు వస్తే.. ఒక్కో కస్టమర్ మీద సగటున రూ. 200 లాభం లభిస్తుంది. ఈ లెక్కన, నెలవారీ ఆదాయం రూ. 60 వేల వరకు ఉంటుంది. నెలవారీ ఖర్చులు సుమారు రూ. 30 వేలు పోనూ.. షాప్ యజమానికి నెలకు రూ. 30 వేలు నికర లాభం లభిస్తుంది. ఈ విధంగా, సంవత్సరానికి సుమారు రూ. 4 లక్షల లాభం ఆర్జించే అవకాశం ఉంది. సరైన ప్లానింగ్, మార్కెటింగ్.. అలాగే ఆన్‌లైన్‌లోనూ మీ డ్రెస్సులు అందుబాటులో ఉంటే.. మీ వ్యాపారం తక్కువ కాలంలోనే వృద్ది సాధిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.