ఇన్వర్టర్ ను వినియోగిస్తున్నారా.. ఈ విషయాలను మర్చిపోయారో అంతే సంగతి..

ఒకప్పుడు పెద్ద హాస్పిటల్ లో, షాపింగ్ మాల్స్ లో, థియేటర్లలో పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ ను వినియోగించేవారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా ఇండ్లల్లో పవర్ బ్యాకప్ కోసం ఇన్వర్టర్లను వినియోగిస్తున్నారు.


దీని ద్వారా పవర్ కట్ సమయంలో ఇంటికి అవసరమైన విద్యుత్తును సరఫరా అవుతుంది. ఇన్వర్టర్ కనెక్షన్ తో ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, LED బల్బ్, టీవీ, ఫ్రిజ్ వంటి అవసరమైన విద్యుత్ ఉపకరణాలను వినియోగించవచ్చు.

మీ ఇంట్లో కూడా ఇన్వర్టర్ ఉంటే దాని ఉపయోగం కోసం కొన్ని చిట్కాలను మీరు తప్పక పాటించాలి. ఎందుకంటే మీకు ఇన్వర్టర్ యూసింగ్ తెలియకుండా దాన్ని ఉపయోగిస్తే దాని జీవితకాలం తగ్గిపోతుంది. అంతేకాదు ఇన్వర్టర్ ఉపయోగిస్తున్న విద్యుత్ ఉపకరణాలు కూడా పాడైపోయే అవకాశం ఉంది. మరి ఆ సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్వర్టర్ లోడ్ పై శ్రద్ధ..

ఇంట్లో ఇన్వర్టర్‌ని ఉపయోగించే ముందు మీ ఇన్వర్టర్ ఎన్ని వాట్స్‌లో ఉందో మీరు తెలుసుకోవాలి. మీ ఇన్వర్టర్ 1 కిలోవాట్ (అంటే 1000 వాట్స్) ఉన్నట్లయితే, మీరు పవర్ కట్ సమయంలో ఇన్వర్టర్ – పవర్డ్ ఎక్విప్‌మెంట్ లోడ్ 1000 వాట్ల కంటే తక్కువగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ ఇన్వర్టర్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.

ఇన్వర్టర్ పవర్ సరఫరా చేయడానికి MCB..

చాలా ఇళ్లలో ఇన్వర్టర్‌ను సరఫరా చేసే మెయిన్ వైర్‌ పై MCB ఉపయోగించరు. దీంతో షార్ట్‌సర్క్యూట్‌ జరిగితే పవర్‌ ఆఫ్‌ కాకపోవడంతో ఇన్‌వర్టర్‌ పాడయ్యే అవకాశం ఉంది. మీరు ఇన్వర్టర్ పవర్ సరఫరా చేసే ప్రధాన వైర్‌ పై MCB ని ఇన్‌స్టాల్ చేస్తే, షార్ట్ సర్క్యూట్ ఉంటే వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది.

ఇన్వర్టర్ బ్యాటరీ నిర్వహణ..

ఇన్వర్టర్ బ్యాటరీలో ఎప్పటికప్పుడు డిస్టిల్ వాటర్ నింపుతూ ఉండాలి. వేసవి కాలంలో ఇన్వర్టర్ బ్యాటరీలో ఉండే నీరు త్వరగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇన్వర్టర్ బ్యాటరీలో తక్కువ నీటి స్థాయికి సంబంధించిన సంకేతం పై శ్రద్ద వహించాలి. గుర్తు తగ్గినట్లయితే బ్యాటరీలో డిస్టిల్ వాటర్ పోసేందుకు వెంటనే ఇన్వర్టర్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి.