అంబాసిడర్ 2.0. త్వరలో మార్కెట్లోకి.. లుక్ చూస్తే దిమ్మదిరిగిపోద్దీ!

1980 కాలంలో భారత కార్ల మార్కెట్ దిగ్గజం అంబాసిడర్. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఈ కారు అప్పట్లో కేవలం రాజకీయ నాయకులు, ప్రముఖులు ఇళ్లల్లో మాత్రమే ఉండేది.


ఆటోమోబైల్ మార్కెట్ ను దాదాపు 70 శాతం ఆక్రమించిన ఈ మోడల్ విక్రయాలు క్రమంగా తగ్గిపోయాయి. దీంతో 2014లో దీని ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో అంబాసిడర్ హక్కులను ఫ్యూజో అనే కంపెనీ రూ.80 కోట్లకు దక్కించుకుంది. ఆ తరువాత ఈ కారు మళ్లీ మార్కెట్లోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు అంబాసిడర్ కొత్త అవతారంలో వస్తుంది. ఇది ఎలా ఉండనుందంటే?

కొత్త అంబాసిడర్ 2.0 కారును హిందూస్తాన్ చెన్నై ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తున్నారు. కొత్త అంబాసిడర్ ను ఆవిష్కరించే క్రమంలో హిందూస్థాన్ మోటార్స్ డైరెక్టర్ మీడియాకు పలు విషయాలు చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుంచి బటయపడ్డామని, యూరోపియన్ కంపెనీల భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు.ఇందులో భాగంగా రూ.600 కోట్ల పెట్టుబడితో అంబాసిడర్ 2.0 ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆటోమోబైల్ రంగంలో చక్రం తిప్పిన అంబాసిడర్ ప్రేమికులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ కారు రూపంలో మళ్లీ రోడ్లపైకి రానుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు గురించిపూర్త వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఫీచర్స్, ధర త్వరలో ప్రకటిస్తామని కంపెనీ డైరెక్టర్ తెలిపారు. 70వ దశకంలో ఒక ఎంతో ఆదరణ పొందిన అంబాసిడర్ మళ్లీ రాబోతుందంటే కారు ప్రియులకు పండుగే.